Begin typing your search above and press return to search.

విశ్వ‌క్ సేన్ ఫ్యామిలీ షో ప‌రుగులెట్టించేలా!

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ కెరీర్ ప‌రంగా ఢోకా లేదు. భారీ విజ‌యాలు ఖాతాలో లేక‌పోయినా త‌న‌దైన ఎన‌ర్జీతో మెప్పించ‌గ‌ల్గుతున్నాడు

By:  Tupaki Desk   |   29 Aug 2023 5:06 AM GMT
విశ్వ‌క్ సేన్ ఫ్యామిలీ షో ప‌రుగులెట్టించేలా!
X

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ కెరీర్ ప‌రంగా ఢోకా లేదు. భారీ విజ‌యాలు ఖాతాలో లేక‌పోయినా త‌న‌దైన ఎన‌ర్జీతో మెప్పించ‌గ‌ల్గుతున్నాడు. ఆ స‌క్సెస్ విశ్వ‌క్ కి అవ‌కాశాలు తెచ్చిపెడుతుంది. హిట్లు లేక‌పోతే అవ‌కాశాలు కష్టం. కానీ విశ్వ‌క్ సేన్ మధ్య మ‌ధ్య‌లో సొంత బ్యాన‌ర్ పై కూడా సినిమాలు నిర్మించ‌డంతో! ఆ ర‌క‌మైన ఐడెంటిటీ కొత్త అవ‌కాశాలు సృష్టిస్తుంది. ప్ర‌స్తుతం యంగ్ హీరో చేతిలో నాలుగైదు ఛాన్సులున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌న లో కొత్త కోణాన్ని ప‌రిచయం చేస్తున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫాంపైనా అదృష్టాన్ని ప‌రీక్షించు కుంటున్నాడు. ఆహా ఓటీటీ షో 'ఫ్యామిలీ ధ‌మాకా' షోని విశ్వ‌క్ సేన్ హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా తెలుగు-తమిళ స్ట్రీమర్ ఆహా ప్రోమోను విడుదల చేసింది. ప్రోమోలోనే విశ్వ‌క్ సేన్ మార్క్ ప‌డింది. త‌న‌దైన ఎన‌ర్జీతో షోను ముందుకు తీసుకెళ్తాడు అన్న కాన్పిడెన్స్ క‌నిపిస్తుంది. కంటెస్టెంట్ల‌ని త‌న‌దైన మార్క్ ఎన‌ర్జీతో ఆక‌ట్టుకుంటున్నాడు.

ప్రోమో లో వినోదం.. ఎమోష‌న్..ఉత్సాహం అన్నీ క‌నిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియ‌న్స్ స‌హా వ‌య‌సుతో సంబంధం లేకుండా అంతా వీక్షించేలా ఉంది. ప్రోమో వ‌ర‌కూ ఎక్క‌డా వ‌ల్గ‌ర్ లేదు. వివిధ కుటుంబాలతో విశ్వ‌క్ సేన్ ఇంట‌రాక్ష‌న్ ఆహ్లాద‌క‌రంగా ఉంది. 'ఫ్యామిలీ ధమాకా'లో ఫ్యామీలి కంటెంస్టెంట్ల‌తో పాటు.. దర్శకులు.. నటీనటులు పాల్గొన్నారు. ప్రోమోలో ప్రతి క‌దిల‌క ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆసక్తికరమైన గేమ్‌లు- చమత్కారమైన సమాధానాలు - ఆసక్తికరమైన ప్రశ్నలతో షో అత్యంత వినోదాత్మక కుటుంబ ప్రదర్శనగా హైలైట్ అవుతుంది. మొత్తం మీద ప్రోమో తో ఫ్యామిలీ ధ‌మాకా ఉత్సాహ‌వంతంగా సాగే షో అని చెప్పొచ్చు. ఈ గేమ్ షో సూపర్‌హిట్ గేమ్ షో' ఫ్యామిలీ ఫార్చ్యూన్స్' నుండి ప్రేరణ పొందింది. సెప్టెంబర్ 8 నుండి ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది.