Begin typing your search above and press return to search.

ఆహాలో విశ్వక్ సేన్ ఫ్యామిలీ ధమాకా.. సాంగ్ చూశారా?

టాలెంటెడ్ యంగ్ హీరీల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వరస అవకాశాలు అందుకొని ముందుకు దూసుకుపోతున్నాడు

By:  Tupaki Desk   |   26 Aug 2023 8:42 AM GMT
ఆహాలో విశ్వక్ సేన్  ఫ్యామిలీ ధమాకా.. సాంగ్ చూశారా?
X

టాలెంటెడ్ యంగ్ హీరీల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వరస అవకాశాలు అందుకొని ముందుకు దూసుకుపోతున్నాడు. ఇటీవల దాస్ కా దమ్కీ సినిమాతో మన ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. అందులో నెగిటివ్ షేడ్ లోనూ నటించి షాకిచ్చాడు. ఓ వైపు వరసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మరోవైపు బుల్లితెరపై కూడా సత్తా చాటడానికి రెడీ అయ్యాడు.

విశ్వక్ సేన్ మామూలుగానే చాలా ఎనర్జిటిక్ ఉంటాడు. అందుకే అతనికి ఓ ప్రోగ్రామ్ హోస్ట్ చేసే బాధ్యతను ఆహా అప్పగించింది. ఆ షో పేరే ఫ్యామిలీ ధమాకా. చాలా కాలంగా విశ్వక్ ఓ షో చేస్తున్నాడు అనే ప్రచారం అయితే జరిగింది. విశ్వక్ కూడా ఓచిన్న హింట్ ఇచ్చాడు. అయితే, తాజాగా ఆహా వారు దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఆ ప్రోమో ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ప్రోమోలో ప్రోగ్రామ్ కి సంబంధించిన పాట ఉంది. ఆ పాటకు విశ్వక్ డ్యాన్స్ అదరగొట్టాడు.అంతేకాకుండా, డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఇక, షోలో తనతో పాటు పాల్గొనే ఫ్యామిలీస్ తో చాలా సులభంగా జెల్ అయినట్లు తెలుస్తోంది. చాలా ఈజ్ తో కనిపిస్తున్నాడు.

ఇక, ఆ ప్రోగ్రామ్ కి వచ్చిన వారు కూడా మామూలు సందడి చేయడం లేదు. ఓ వ్యక్తి విశ్వక్ పై అభిమానం చూపించాడు. విశ్వక్ నటించిన అన్ని సినిమాల పేర్లతో ఓ డైలాగు చెప్పగా, అది ప్రోమోకే హైలెట్ గా మారింది. ప్రోమోనే ఇలా ఉంది అంటే, షో ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ షో ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచి వస్తుంది అనే అప్ డేట్ అయితే ఇవ్వలేదు. కానీ, సెప్టెంబర్ లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొన్నటి వరకు ఆహాలో బాలయ్య సందడి చేయగా, ఇప్పుడు విశ్వక్ వంతు వచ్చింది.

అయితే, హోస్టింగ్ చేయడం అంటే సినిమాల్లో చేసినంత సులభంగా అయితే కాదు. ఎందుకంటే, సినిమాల్లో వాళ్లు ఇచ్చిన డైలాగులు చెబితే సరిపోతుంది. కానీ, హోస్టింగ్ అంటే చాలా స్పాంటేనియస్ గా ఉండాలి. ఇప్పటి వరకు హోస్టింగ్ చాలా మంది మన టాలీవుడ్ స్టార్స్ ట్రై చేశారు. కానీ, అందరూ సక్సెస్ కాలేకపోయారు. మరి విశ్వక్ ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.