Begin typing your search above and press return to search.

విశ్వక్ స‌ర్‌ప్రైజ్‌.. ఇది అసలు మ్యాటర్

అయితే విశ్వక్ సేన్ లైఫ్ లో నెక్స్ట్ చాప్టర్ మొదలుపెట్టడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో ఎనౌన్స్ చేశాడు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:58 AM GMT
విశ్వక్ స‌ర్‌ప్రైజ్‌.. ఇది అసలు మ్యాటర్
X

టాలీవుడ్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొత్త కొత్త కథలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది దాస్ కా ధమ్కీ మూవీతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో గోదావరి బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ షూటింగ్ ఫైనల్ దశకి వచ్చేసింది.


ఈ సినిమాలో విశ్వక్ సేన్ స్లాంగ్ మార్చుకొని గోదావరి స్టైల్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఆప్యాయతలు మాత్రమే కాదు. ఆవేశం కూడా ఉంటుంది. బీభత్సమైన ఆధిపత్య పోరు కూడా ఉంటుందని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో చూపించబోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. రామ్ తాళ్లూరి నిర్మాణంలో రవితేజ తో కూడా ఒక మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

అయితే విశ్వక్ సేన్ లైఫ్ లో నెక్స్ట్ చాప్టర్ మొదలుపెట్టడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో ఎనౌన్స్ చేశాడు. తన లైఫ్ లో నెక్స్ట్ ఫేజ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నట్లు చెప్పాడు. ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను అంటూ ప్రకటనతో కన్ఫర్మ్ చేశారు. త్వరలో దీనికి సంబందించిన అన్ని విషయాలు పంచుకుంటానని కూడా క్లారిటీ ఇచ్చాడు.

ఇక విశ్వక్ అలా క్లారిటీ ఇవ్వగానే పెళ్లికి సంబంధించిన వార్తతో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. విశ్వక్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరు అనే విషయం గురించి కూడా అందరూ సోషల్ మీడియాలో ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వ్యక్తిని పెళ్లాడాబోతున్నాడా, లేదంటే తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా అనేలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే ఆ పోస్ట్ విశ్వక్ పెళ్లి గురించి కాదని తెలుస్తోంది. ఇటీవల విశ్వక్ సేన్ ఓటీటీ వరల్డ్ లో సరికొత్త దారిలో నడవబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో మనోడు ఒక షో కోసం హోస్ట్ గా కనిపించబోతున్నాడు. అదే విషయం గురించి ఈ విధంగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో చెప్పిన టైమ్ కు విశ్వక్ ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నాడు.