Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్.. వ్వాటే టైటిల్

కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న ఆయన.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 1:06 PM GMT
విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్.. వ్వాటే టైటిల్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటుల్లో మాస్ దా కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న ఆయన.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు.

ఫలక్ నామ్ దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాల దర్శకనిర్మాణ బాధ్యతలను విజయవంతంగా చేపట్టారు విశ్వక్ సైన్. ఫలక్ నామా దాస్ తో రైటర్ గా మారిపోయారు. ఇప్పుడు తన హోమ్ బ్యానర్లు వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ ద్వారా ఇండస్ట్రీకి కొత్త వాళ్లను పరిచయం చేయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఈ సినిమా ద్వారా 20 మంది కొత్తవారు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

CULT పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు విశ్వక్ సేన్. ఈ చిత్రానికి ఆయనే రైటర్. తాజుదీన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీకి "లైక్ ఎ లీప్ ఇయర్ 2024" అని ట్యాగ్ లైగ్ ఇచ్చారు. డ్రోగ్స్ కు నో చెప్పండనే సందేశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.

మరోవైపు, విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2024 సంవత్సరం మార్చిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో విశ్వక్ మరో భారీ సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్‌తో పాటు సుట్టంలా సూసి అనే ఫ‌స్ట్ సింగిల్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో కొనసాగే పీరియడ్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇది. మరోవైపు VS10లో కూడా నటిస్తున్నారు విశ్వక్‌సేన్‌. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. దీంతోపాటు అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌ గామి కూడా పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ రూ.5 కోట్ల రేంజ్ లో ఉందని టాక్