Begin typing your search above and press return to search.

మొదటి సారి ఆ పని చేసిన విశ్వక్‌ సేన్‌

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్ సక్సెస్ ఫ్లాప్స్‌ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు

By:  Tupaki Desk   |   2 Aug 2023 10:12 AM GMT
మొదటి సారి ఆ పని చేసిన విశ్వక్‌ సేన్‌
X

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్ సక్సెస్ ఫ్లాప్స్‌ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ యువ హీరో కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గ్లిమ్స్ కు మంచి స్పందన రావడంతో పాటు జనాల్లోకి సినిమా బాగా వెళ్లడం.. పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో విశ్వక్‌ సేన్ ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందంలో ఎప్పుడు చేయని ఒక పని చేశాను అంటూ సోషల్‌ మీడియాలో ఒక వీడియోను షేర్‌ చేయడం జరిగింది.

తన మొదటి ఇన్ స్టాగ్రామ్‌ రీల్ అంటూ ఆలియా భట్‌.. రణ్వీర్ సింగ్ నటించిన రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్‌ కహానీ సినిమాలోని వాట్ జుంఖా... పాటకు డాన్స్ చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సింగర్స్ తో కలిసి సరదాగా విశ్వక్‌ సేన్‌ డాన్స్ చేసి.. ఆ వీడియోను ఇలా సోషల్ మీడియాలో షేర్‌ చేయడం జరిగింది.

రణవీర్.. ఆలియా ల ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా చేయడంతో ఇక్కడ మరింతగా ఆ పాట పాపులారిటీని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి తన సినిమా కి పబ్లిసిటీ అవ్వడంతో పాటు ట్రెండ్డింగ్‌ లో ఉన్న పాటకు డాన్స్ చేయడం ద్వారా వార్తల్లో విశ్వక్ సేన్ నిలిచాడు.