Begin typing your search above and press return to search.

'గామి' - ఈ సెంటిమెంట్ కలిసొస్తే బీభత్సమే..

విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా గామి

By:  Tupaki Desk   |   6 March 2024 5:40 AM GMT
గామి - ఈ సెంటిమెంట్ కలిసొస్తే బీభత్సమే..
X

విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా గామి. ఎప్పుడో ఐదేళ్ల క్రితమే ఈ చిత్రాన్ని విశ్వక్ సేన్ స్టార్ట్ చేశాడు. ఇన్నేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న మూవీ ఫైనల్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఐదేళ్ల పాటు సినిమా కోసం పడిన కష్టం ఏంటనేది ఈ మూవీ ట్రైలర్ లోనే స్పషంగా కనిపిస్తోంది.

హై స్టాండర్డ్స్ విజువలైజేషన్, నెవ్వర్ బిఫోర్ ప్రెజెంటేషన్ తో గామి మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే విశ్వక్ సేన్ కూడా కెరియర్ లో చాలా సాహసోపేతమైన క్యారెక్టర్ ని గామి సినిమాలో చేశారని అర్ధమవుతోంది. మానవ స్పర్శ తగిలితే ఇబ్బందికి గురయ్యే డిఫరెంట్ క్యారెక్టర్ లో అఘోరాగా విశ్వక్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు.

సమస్యని పరిష్కరించుకోవడానికి హిమాలయాలు, మంచు పర్వతాలలో అతను చేసే ప్రయాణాన్ని దృశ్యరూపంలో గామిలో చూపిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సార్ టీమ్ 'A' సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు A సెన్సార్ వస్తేనే సినిమాకు కలెక్షన్స్ వస్తాయో రావో అనే అనుమానాలు చాలానే వచ్చేవి. నిర్మాతలు కూడా భయపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో A సర్టిఫికెట్ అందుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని సూపర్ హిట్ అవుతున్నాయి.

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికి తెలిసిందే. ఏకంగా 900 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. గత ఏడాది థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా నిలిచింది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ కి A సర్టిఫికెట్ ని సెన్సార్ టీమ్ ఇచ్చింది.

ఈ రెండు సినిమాల్లో రక్తం నిండిన ఊచకోత సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పెద్దవారికే అని సెన్సార్ వచ్చింది. ఇక యానిమాల్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ హై డోస్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ దగ్గర సలార్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఏకంగా 700 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఖాతాలో సలార్ తో సూపర్ హిట్ పడింది. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ ను బట్టి A సెన్సార్ వస్తుందని అనుకున్నారు.

కానీ గామి లో ట్రైలర్ లో చూపించిన కంటెంట్ ను బట్టి అసలు A వస్తుందని ఎవరు ఊహించలేదు. హీరో అఘోరా క్యారెక్టర్ కాబట్టి బహుశా అతనికి సంబంధించిన సీన్స్ ఏమైనా బోల్డ్ గా చూపించి ఉండవచ్చు. ఏదేమైనా A సెన్సార్ ను ఇటీవల కాలంలో సెంటిమెంట్ గా చూసుకుంటే కచ్చితంగా సూపర్ హిట్ కేటగిరీలోకి వెళ్లే మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు ఆడియన్స్ అటెన్షన్ ని కూడా గామి మూవీ గ్రాబ్ చేస్తోంది. కచ్చితంగా విశ్వక్ సేన్ కెరియర్ లో బెస్ట్ మూవీగా గామి మారే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.