Begin typing your search above and press return to search.

గామి.. విశ్వక్ ఏ లెవెల్లో కష్టపడ్డాడంటే..

విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం గామి

By:  Tupaki Desk   |   3 March 2024 4:21 AM GMT
గామి.. విశ్వక్ ఏ లెవెల్లో కష్టపడ్డాడంటే..
X

విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం గామి. విశ్వక్ సేన్ వెళ్ళిపోమాకే తర్వాత గామి చిత్రాన్ని స్టార్ట్ చేశాడంట. క్రౌడ్ ఫండింగ్ తో చేసిన చిత్రం కావడంతోపాటు కథ నేపథ్యం ప్రకారం ఇన్నేళ్లు పట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ పాల్గొంటున్నాడు. వి సెల్యులాయిడ్ బ్యానర్ సమర్పణలో మూవీ రిలీజ్ కాబోతోంది.

కార్తిక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చాందినీ చౌదరిలో ఫీమేల్ లీడ్ చేసింది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో విజువలైజేషన్, పిక్చరైజేషన్ ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అలాగే విశ్వక్ సేన్ ఒక కమర్షియల్ హీరో అయ్యుండి ఎవ్వరూ ఊహించని పాత్రలో మూవీలో కనిపిస్తూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మూవీని తన భుజాలపై వేసుకొని విశ్వక్ సేన్ ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో సినిమా విశేషాలని విశ్వక్ సేన్ పంచుకున్నారు. ఈ సినిమాకి సమయమే పెట్టుబడి అని విశ్వక్ పేర్కొన్నారు. కథ చదివినపుడే మూవీ తీయడానికి ఐదేళ్లు పడుతుందని అనుకున్న. దర్శకుడు విద్యాధర్ ఈ కథ మీద చాలా రీసెర్చ్ చేశాడు.

టీమ్ లో మిగిలిన వారి ఎఫర్ట్ 10 శాతం ఉంటే మిగిలిన 90 శాతం దర్శకుడిదే ఉంటుంది. అంతగా స్టడీ చేసుకొని ఎంతో అధ్యాయనం చేసి కథని సిద్ధం చేసుకున్నాడు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను కథ మొత్తం చదివాను. ఒకసారి పాత్రకి నేను కనెక్ట్ అయిన తర్వాత ఎప్పుడు షూటింగ్ ఉన్న పదిరోజులు ముందు చెప్పేవాడు. నేను క్యారెక్టర్ ని ఎడాప్ట్ చేసుకొని ప్రిపేర్ అయ్యేవాడిని.

అఘోరా పాత్రలో నేచురల్ గా నటించడంతో కొంతమంది తనని నిజమైన అఘోరాగానే భావించి డబ్బులు దానం చేసేవారు. మైనస్ డిగ్రీల చలిలో మూవీ షూటింగ్ చేసేవాళ్ళం. కాళ్ళు, చేతులు గడ్డకట్టేస్తూ ఉండేవి. ఇప్పుడు అవుట్ ఫుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా కోసం నేను చేసింది ఇంకా ఏదైనా ఉందంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించడమే. 70 రోజులు సినిమా షూటింగ్ చేశాను. అనుకున్న టైంలోనే మూవీ పూర్తిచేశాం. ఈ టైంలో రావడం కరెక్ట్ అనిపించి ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నాం అని విశ్వక్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.