Begin typing your search above and press return to search.

'గామి'.. డబ్బింగ్ తోనే హైప్ ఎక్కిస్తున్న విశ్వక్

ప్రతి సినిమాతో కూడా చాలా కొత్తగా తరహాలో ఆకట్టుకునే కొద్దిమంది యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు

By:  Tupaki Desk   |   29 Nov 2023 12:46 PM GMT
గామి.. డబ్బింగ్ తోనే హైప్ ఎక్కిస్తున్న విశ్వక్
X

ప్రతి సినిమాతో కూడా చాలా కొత్తగా తరహాలో ఆకట్టుకునే కొద్దిమంది యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రస్తుతం అతని లైన్ అప్ లో కూడా చాలా డిఫరెంట్ సినిమాలో ఉన్నాయి. కొన్ని స్టైలిష్ గా ఉంటే మరికొన్ని మాస్ గా ఉండబోతున్నాయి.

ఇక మరికొన్ని ఊహలకు అందని విధంగా ప్రయోగత్మకమైన కథలు కూడా అతను చేస్తున్నాడు. అలాంటి వాటిలో గామి అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమా చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని విశ్వక్సేన్ కష్టపడుతున్నాడు. ఇందులో అతడు ఒక అఘోరా పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది

గతంలోనే గామి సినిమాకు సంబంధించి ఒక టీజర్ కూడా విడుదల చేశారు దానికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. విద్యాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కథ ఆలోచింపజేసే విధంగా ఉంటుందని కూడా ఆ టీజర్ ద్వారా అర్థమైంది. ఇక గామి సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.

లేటెస్ట్ గా విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా సినిమా అప్ డేట్ అయితే ఇచ్చాడు. సినిమాకు డబ్బింగ్ చెబుతున్న ఒక వీడియోని పోస్ట్ చేసిన అతను సినిమాలోని డైలాగులు కూడా ఎంతో ఆసక్తిగా చెబుతున్నాడు. అర్థంకానీ రోగంతో నేనే వద్దని బాధపడుతుంటే.. అసలు ఏ కారణం లేని అవి నీకెందుకు కావాలో నాకు అర్థం కావడం లేదు.. డబ్బు కోసమే కదా.. అని విశ్వక్ ఏదో డెప్త్ ఉన్న డైలాగ్ తో డబ్బింగ్ చెబుతున్న విధానం అద్భుతంగా ఉంది.

ఇక ఈ సినిమా రన్ టైమ్ రెండు గంటల 24 నిమిషాల నిడివితో రానున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చారు. అలాగే రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు విశ్వక్ తెలియజేశాడు. విశ్వక్ రకరకాల జానర్‌లను ట్రై చేయడంలోనూ వైవిధ్యం చూపిస్తున్నాడు. ఇక అందులో గామి ఒకటి. ఇక గామి అనే సినిమా తో పాటు విశ్వక్ సేన్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టాడు. అందులో నెక్స్ట్ రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి. సీతార ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందుతున్న ఆ సినిమా కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక సినిమాను 2024 మార్చి 8న విడుదల చేయనున్నారు.