Begin typing your search above and press return to search.

విశ్వక్ 'గామి'.. రన్ టైమ్ ఫిక్స్

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో విభిన్నమైన పాత్ర ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   7 Nov 2023 12:06 PM GMT
విశ్వక్ గామి.. రన్ టైమ్ ఫిక్స్
X

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో విభిన్నమైన పాత్ర ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ఇక అతని నటన విధానం కూడా ప్రతి సినిమాకు చేంజ్ అవుతూనే ఉంది. కంప్లీట్ యూత్ లవర్ బాయ్ గానే కాకుండా మరోవైపు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ క్యారెక్టర్ లో కూడా కనిపించేందుకు ఆసక్తిని చూపిస్తున్నాడు.


విశ్వక్ సేన్ ప్రస్తుతం సెట్ చేసుకున్న లైనప్ కూడా చాలా విభిన్నంగా ఉంది. ఇక ఎప్పటినుంచో విశ్వక్ సేన్ గామి అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. చాలా కాలంగాసెట్స్ సెట్స్ పై ఉన్న ఈ సినిమాను అప్డేట్స్ తోనే విశ్వక్ సేన్ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అతను అఘోర పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా గతంలోనే ఒక టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

విద్యాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ పాత్ర నెవ్వర్ బిఫోర్ అనేలా ఊహించని స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఇక మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన మరొక కీలకమైన అప్డేట్ ను చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది. ఈ సినిమా రన్ టైమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు గంటల 24 నిమిషాల నిడివి గల ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ సిద్ధమయింది.

ఫైనల్ గా ఎడిటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒకటి ఫ్రెండ్ తెలుగు కనిపించే సన్నివేశాలతో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ రకరకాల జానర్‌లను ట్రై చేయడంలోనూ వైవిధ్యం చూపిస్తున్నాడు. ఇక అందులో గామి ఒకటి. గామికి విద్యాసాగర్ కగిత దర్శకత్వం వహించారు మరియు దీనిని కార్తీక్ శబరీష్ మరియు వి సెల్యులాయిడ్ నిర్మించారు.

ఇక గామి అనే సినిమా తో పాటు విశ్వక్ సేన్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టాడు. అందులో నెక్స్ట్ రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి. సీతార ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందుతున్న ఆ సినిమా కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని కోరుకుంటున్నారు. ఆ సినిమాలో విశ్వక్ కంప్లీట్ మాస్ రోల్ లో మెప్పించబోతున్నాడు.