Begin typing your search above and press return to search.

జనసేనలో చేరుతారా..? విశ్వక్‌సేన్‌ సూపర్‌ ఆన్సర్‌

సినిమా వేడుక కనుక జనసేన పార్టీకి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో మాట్లాడితే కచ్చితంగా ఇబ్బంది ఉంటుందని విశ్వక్‌ సేన్‌ కి తెలుసు.

By:  Tupaki Desk   |   7 March 2024 4:43 AM GMT
జనసేనలో చేరుతారా..? విశ్వక్‌సేన్‌ సూపర్‌ ఆన్సర్‌
X

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ హీరోగా హీరోగా నటించిన గామి సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు అయిదు సంవత్సరాల పాటు మేకింగ్‌ లోనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా కోసం విశ్వక్‌ సేన్ చాలా కష్టపడ్డాడు. ఆ విషయం ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

తాజాగా గామి సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరు అయిన గామి వేడుకను విభిన్నంగా నిర్వహించారు. ఫ్యాన్స్ తో పాటు మీడియా వారితో కూడా యూనిట్‌ సభ్యులు చిట్‌ చాట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ ను మీడియా మిత్రుడు ఒకరు.. మీ నాన్న గారు ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లో అనుకూలంగా ఉండే వారు. ఇప్పుడు మీరు ఏమైనా జనసేన పార్టీలో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించగా విశ్వక్‌ సేన్‌ నుంచి సూపర్‌ ఆన్సర్‌ వచ్చింది.

సినిమా వేడుక కనుక జనసేన పార్టీకి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో మాట్లాడితే కచ్చితంగా ఇబ్బంది ఉంటుందని విశ్వక్‌ సేన్‌ కి తెలుసు. అందుకే చాలా తెలివిగా తనకు డొనాల్డ్ ట్రంప్ కి పెద్ద ఫ్యాన్‌.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలో అక్కడికి వెళ్లి ఓటు వేస్తాను అంటూ సమాధానం ఇచ్చాడు.

చాలా సున్నితమైన ఆ ప్రశ్నకు చాలా తెలివిగా ఎలాంటి వివాదం లేకుండా డొనాల్డ్‌ ట్రంప్ కి ఫ్యాన్‌ ని ఇక్కడ రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. నన్ను అందులోకి లాగొద్దు అన్నట్లుగా విశ్వక్‌ సేన్‌ చెప్పిన తెలివైన సమాధానం కు అంతా కూడా ఫిదా అవుతున్నారు.