Begin typing your search above and press return to search.

అమ్మాయిగా విశ్వక్ సేన్.. ఆ ధైర్యమేంటి బాబు?

అయితే ఈసారి విశ్వక్ లైలా సినిమాలో మాత్రం సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు అమ్మాయిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

By:  Tupaki Desk   |   6 March 2024 2:30 PM GMT
అమ్మాయిగా విశ్వక్ సేన్.. ఆ ధైర్యమేంటి బాబు?
X

ఈ మధ్యకాలంలో యువ హీరోలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇక అందులో ముఖ్యంగా విశ్వక్ సేన్ అయితే టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. అతని ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్త తరహా పాయింట్ అయితే హైలైట్ అవుతూ ఉంటుంది. క్యారెక్టర్ విషయంలో కూడా విశ్వక్ తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని అన్ని కావు.

ఇప్పుడు అతని నుంచి రాబోతున్న గామి సినిమాలో అయితే ఏకంగా అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక రాబోయే రోజుల్లో విశ్వక్ మరిన్ని డిఫరెంట్ పాత్రలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా లైలా అనే సినిమాకు సంబంధించిన రోల్ కూడా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అందులో విశ్వక్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఎ హీరో కూడా ఈ తరహా రిస్క్ చేయడానికి అయితే అసలు ఇష్టపడరు.

గతంలో కొంతమంది కామెడీస్టార్లలో రాజేంద్రప్రసాద్ నరేష్ మాత్రమే మేడమ్, చిత్రం భళారే విచిత్రం.. వంటి సినిమాల్లో లేడి గెటప్స్ కనిపించి వారి నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఈసారి విశ్వక్ లైలా సినిమాలో మాత్రం సెకండ్ హాఫ్ లో ఎక్కువసేపు అమ్మాయిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

అయితే కేవలం గెటప్ వరకు మాత్రమే విశ్వక్ అమ్మాయిగా కనిపిస్తాడా లేదంటే రియాలిటీ కి దగ్గరగా ఏదైనా ట్విస్ట్ ఇస్తారా అనేది సినిమా చూస్తే కానీ అర్థం అవ్వదు. కానీ చాలా ఎక్కువ సేపు అమ్మాయి పాత్రలో కనిపిస్తాడు అంటే విశ్వక్ ధైర్యానికి అందరూ షాక్ అవుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఫలితం ఊహించని విధంగా ఉంటుంది.

అయితే విశ్వక్ మాత్రం ఆ కాన్సెప్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నాడు. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఆ క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ ఎలాంటి సినిమా చేసిన కూడా షూటింగ్ కు ముందు రోజే సన్నివేశాల గురించి దర్శకులతో చర్చించడం, ప్రత్యేకంగా వర్క్ షాప్ లో పాల్గొనడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇక అమ్మాయి క్యారెక్టర్ కాబట్టి అంతకుమించి అనేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.

ఏదేమైనా విశ్వక్ ఇప్పుడు గామి సినిమాలో అఘోరా పాత్ర చేయడం ఆ తరువాత లైలా సినిమాలో అమ్మాయి పాత్రగా కనిపించడం చాలా రిస్కీ క్యారెక్టర్స్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ ఈ రోజుల్లో ఆడియన్స్ ఎంతో కొత్తగా ఉంటే గానీ థియేటర్లోకి రావడం లేదు. అలాగే హీరోలు కూడా నటుడిగా మరో లెవల్ కు వెళ్లాలంటే ఇలాంటి రిస్కులు చేయక తప్పదు. ఇక రిస్కీ కంటెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.