Begin typing your search above and press return to search.

విశ్వక్ 100 కోట్ల గర్జన ఎప్పుడు..?

సినిమా అవుట్ పుట్ పై చిత్ర యూనిట్ సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. విశ్వక్ కు 100 కోట్లు తెచ్చే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినే అంటున్నారు.

By:  Tupaki Desk   |   13 April 2024 6:51 AM GMT
విశ్వక్ 100 కోట్ల గర్జన ఎప్పుడు..?
X

స్టార్ హీరోలంతా కూడా 500 కోట్లు, 1000 కోట్ల టార్గెట్ తో సినిమాలు చేస్తుంటే టాలీవుడ్ యువ హీరోలంతా కూడా 100 కోట్ల టార్గెట్ తో వస్తున్నారు. ఇదివరకు 50 కోట్లు కొట్టడమే చాలా కష్టం అనిపించిన యంగ్ హీరోలు తాము కూడా 100 కోట్ల హీరోలమని ప్రూవ్ చేసుకుంటున్నరు. స్టార్ క్రేజ్ రాకముందే గీతా గోవిందంతో విజయ్ దేవరకొండ 100కోట్లు దక్కించుకున్నాడు. మొదటి సినిమాతో వైష్ణవ్ తేజ్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో చెప్పి మరీ 100 కోట్లు కొల్లగొట్టాడు.

ఇక యువ హీరోల్లో 100 కోట్ల స్టామినా ఉన్న హీరో విశ్వక్ సేన్ కూడా కనిపిస్తున్నాడు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో తెలిసిందే. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా సినిమాకు ఎలా అంటే అలా తన ఫుల్ సపోర్ట్ అందించే విశ్వక్ సేన్ తన కష్టాన్ని నమ్ముకుని పైకి ఎదుగుతున్నాడు. విశ్వక్ సేన్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే రేంజ్ కి వచ్చాడు. అయితే కెరీర్ లో హిట్లు ఫ్లాపులతో కెరీర్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న విశ్వక్ సేన్ 100 కోట్లు అనేది కలగానే ఉంది.

విశ్వక్ కు యూత్ లో ఉన్న క్రేజ్ కి 100 కోట్లు పెద్ద కష్టమేమి కాదు. కానీ అలాంటి సరైన కథ పడట్లేదని చెప్పొచ్చు. అయితే టిల్లు స్క్వేర్ తో సిద్ధు 100 కోట్లు కొట్టగా విశ్వక్ సేన్ ప్రస్తుతం చేస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆ ఫీట్ అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే లో రిలీజ్ లాక్ చేశారు.

సినిమా అవుట్ పుట్ పై చిత్ర యూనిట్ సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. విశ్వక్ కు 100 కోట్లు తెచ్చే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినే అంటున్నారు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈమధ్యనే గామి సినిమాతో వచ్చి సూపర్ అనిపించుకున్న విశ్వక్ సేన్ గోదావరి గ్యాంగ్ తో 100 కోట్ల వసూళ్లను తెస్తాడా లేదా అన్నది చూడాలి.