Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ కొత్త సినిమా.. ఎంతవరకు వచ్చిందంటే..

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందంట

By:  Tupaki Desk   |   21 July 2023 5:51 AM GMT
విశ్వక్ సేన్ కొత్త సినిమా.. ఎంతవరకు వచ్చిందంటే..
X

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. ఈ ఏడాది దాస్ కా ధమ్కీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ ని తనఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీతో దర్శకుడిగా, నిర్మాతగా కూడా విశ్వక్ సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విశ్వక్ రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడీగా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రవితేజ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందంట. తాజాగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ మరొక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్ సగం కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తుంది . దానితో పాటు రవితేజ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. గ్రాండ్ స్కేల్ పై ఈ చిత్రాన్ని నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ స్టైల్ లోనే మాస్ ఫన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. వీలైతే ఈ ఏడాదిలోనే ఈ మూవీని రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు.

మీనాక్షి చౌదరి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. దీంతో పాటుగా ఇప్పుడు విశ్వక్ సేన్ తో కమిట్ అయిన ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడం విశేషం. చివరిగా ఈ బ్యూటీకి హిట్ 2తో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ తో చేస్తోన్న ప్రాజెక్ట్ పై చాలా హోప్స్ పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

దాస్ కా దమ్కీ తర్వాత విశ్వక్ నుంచి రాబోతున్న మరో అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ మూవీగా ఈ చిత్రం సిద్ధం అవుతోన్న నేపథ్యంలో కచ్చితంగా అతని ఖాతాలో మరో హ్జిట్ గా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కృష్ణ చైతన్యతో చేస్తోన్న మూవీ కంప్లీట్ గా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టొరీతో ఉండబోతోంది. ఈ సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్ జోనర్ లోనే రాబోతోంది.