Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ ఈ టైం లో అవసరమా..?

విశ్వక్ సేన్ తనదైన స్టైల్ లో అదరగొట్టేస్తున్నాడు

By:  Tupaki Desk   |   15 July 2023 7:42 AM GMT
విశ్వక్ సేన్ ఈ టైం లో అవసరమా..?
X

యువ హీరోల్లో వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్న విశ్వక్ సేన్ తనదైన స్టైల్ లో అదరగొట్టేస్తున్నాడు. ముఖ్యంగా మాస్ కా దాస్ స్క్రీన్ నేమ్ కి తగినట్టుగానే తన అప్పీల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. హీరోగానే కాదు డైరెక్టర్ గా కూడా తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు విశ్వక్ సేన్. యంగ్ హీరోల్లో స్టార్ ఫీచర్స్ ఉన్న నటుడిగా కనిపిస్తున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణంలో త్రివిక్రం కూడా భాగస్వామ్యం అవుతున్నారని తెలిసిందే.

సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న విశ్వక్ సేన్ సితార బ్యానర్ లో వస్తున్న సినిమా తర్వాత తన రేంజ్ పెరగబోతుందని తెలుస్తుంది. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.

అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ ఆహా OTTలో ఒక షో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆహా ఓటీటీ ఒక స్పెషల్ ఫిక్షనల్ షో ప్లాన్ చేశారట. దానికి హోస్ట్ గా విశ్వక్ అయితే పర్ఫెక్ట్ అని అనుకున్నారట.

విశ్వక్ కూడా షూటింగ్ గ్యాప్ లో ఆహా కోసం తన డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 15 ఎపిసోడ్స్ తో రాబోతున్న ఈ షో లో విశ్వక్ సేన్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని అంటున్నారు. షో కాన్సెప్ట్.. డిజైన్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయట. అందుకే విశ్వక్ సేన్ ఈ షో చేసేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ షో హోస్ట్ గా చేస్తున్నందుకు విశ్వక్ సేన్ భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

అటు సినిమాలు ఇటు ఓటీటీ షో.. విశ్వక్ కెరీర్ ప్లానింగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఉన్న కొద్ది పాటి టైం ని కూడా ఓటీటీ ఆడియన్స్ కోసం స్పెండ్ చేస్తున్నాడు విశ్వక్. ఆడియన్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టే వారిని ఇంకా ఎంటర్టైన్ చేయాలనే ప్లాన్ తో విశ్వక్ సేన్ ఇలాంటివి చేస్తున్నాడని చెప్పొచ్చు.

సెట్స్ మీద ఒక సినిమా ఉండగా మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. విశ్వక్ దూకుడు చూసి మిగతా హీరోలంతా అవాక్కవుతున్నారు. 7 ఏళ్లలో 10 సినిమాలు యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ రానున్న రోజుల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు