Begin typing your search above and press return to search.

రవితేజ-విశ్వక్ సేన్ సినిమా.. ఎక్కడి వరకు వచ్చిందంటే

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Aug 2023 7:53 AM GMT
రవితేజ-విశ్వక్ సేన్ సినిమా.. ఎక్కడి వరకు వచ్చిందంటే
X

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దాస్ కా ధమ్కీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఈ చిత్రంతోనే దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్నారు. అయితే ఇప్పుడాయన చేతిలో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.

అందులో ఒకటి.. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రవితేజ రూపొందిస్తున్నారు. ఆ మధ్య షూటింగ్ లో భాగంగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు తాజాగా రెండో షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుందట.

ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ వర్గాల నుంచి తెలిసింది. దీంతో విశ్వక్.. తన మరో సినిమాపైకి ఫోకస్ ను షిప్ట్ చేశారట. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదారి సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ మూవీ షూటింగ్ కోసం రెడీ అవుతున్నారట. ఈ సినిమా చిత్రీకరణ కంప్లీట్ గా పూర్తవ్వగానే మళ్లీ రవితేజ సినిమా చిత్రీకరణను షురూ చేస్తారని తెలిసింది.

ఇకపోతే ఈ రెండు చిత్రాల సంగతి పెక్కనపెడితే ఇప్పటివరకు నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా రాణించిన విశ్వక్ సేన్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఆహాలో సరికొత్త గేమ్ షోతో హోస్ట్ గా రానున్నారు. ఫ్యామిలీ ధమాకా పేరుతో ఈ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్ట్ 15న దీనికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది.

ఇకపోతే విశ్వక్ కెరీర్ విషయానికొస్తే.. పిట్టకథ షార్ట్ ఫిలింతో కెరీర్ ప్రారంభించిన ఆయన.. వెళ్ళిపోమాకే హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ చిత్రాలతో మాస్ కా దాస్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హిట్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో అలరించారు.