Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ మెకానిక్ మొదలైంది!

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు

By:  Tupaki Desk   |   11 Jun 2024 7:07 AM GMT
విశ్వక్ సేన్ మెకానిక్ మొదలైంది!
X

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. థియేటర్స్ లో ఓ వర్గం మాస్ ఆడియెన్స్ బాగానే ఎంజాయ్ చేశారు. దీంతో కమర్షియల్ గా మూవీ బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను ఫినిష్ చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో విశ్వక్ సేన్ మార్కెట్ పై మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఇక రాబోయే మరో సినిమాతో బిగ్ అందుకోవాలని చూస్తున్నాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జూన్ 14న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రిజల్ట్ ఎలా ఉన్నా విశ్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే అఫీషియల్ గా స్టార్ట్ అయ్యాయి. రామ్ తాళ్ళూరి నిర్మాణంలో మెకానిక్ రాకీ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కారణంగా ఫైనల్ షెడ్యూల్ వాయిదా పడింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూడ్ నుంచి బయటకొచ్చిన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ షూటింగ్ లో మళ్ళీ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ని స్టార్ట్ చేశారు. వీలైనంత వేగంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మెకానిక్ రాకీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంట.

మెకానిక్ రాకీ మూవీలో విశ్వక్ సేన్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. రవితేజ ముళ్ళపూడి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

విశ్వక్ సేన్ ఈ సినిమాలో కార్ మెకానిక్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ చిత్రాన్ని తనకి అలవాటైన జోనర్ లోనే చేస్తున్నారు. కాబట్టి కచ్చితంగా ఈ సినిమాతో సక్సెస్ వస్తుందనే కాన్ఫిడెన్స్ తో విశ్వక్ ఉన్నారు. దీని తర్వాత మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ ని సెట్స్ పైకి విశ్వక్ సేన్ తీసుకొని వెళ్లే అవకాశం ఉంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.