Begin typing your search above and press return to search.

విశ్వక్ గామి.. ఆ రోజే పవర్ఫుల్ ట్రైలర్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరో

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:03 AM GMT
విశ్వక్ గామి.. ఆ రోజే పవర్ఫుల్ ట్రైలర్
X

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హీరో. భిన్నమైన లైనప్ తో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న ఈ నటుడు ప్రతీ సినిమాలో కూడా తన క్యారెక్టర్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక త్వరలో రాబోయే గామి కూడా అలాంటి కథే.

దర్శకుడు విద్యాధర్ కగిట ఈ చిత్రాన్ని అడ్వెంచర్‌ డ్రామాగా తెరపైకి తీసుకు వస్తున్నాడు. మొదట్లోనే పాజిటివ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. హైదరాబాద్ లో కామిక్‌ కాన్‌ మూవీ ఫెస్టివల్ లోనే గామి ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసి మంచి హైప్ క్రియేట్ చేశారు. మానవ స్పర్శకు దూరంగా ఉండే ఒక వ్యక్తి అఘోరా గా ఎలా మారాడు లోతైన సత్యం కోసం అతని అన్వేషణ ఎక్కడి వరకు సాగింది అనే పాయింట్ తో ఈ సినిమా తెరపైకి రానుంది.

ఆ సినిమా కథలోని చాలా అంశాలు చాలా ఆలోచింపజేసే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. సినిమా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గామి ట్రైలర్ త్వరలోనే రాబోతోంది. ఆ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చేసింది.

విశ్వక్ సేన్ యొక్క గామి షోరీల్ ట్రైలర్, PCX ఫార్మాట్‌ లో మొట్టమొదటి ట్రైలర్ గా రానుంది. PCX స్క్రీన్, ప్రసాద్స్‌లో ఫిబ్రవరి 29న విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ట్రైలర్ పోస్టర్స్ అంచనాల స్థాయిని పెంచేశాయి. ఇక ఇప్పుడు డిఫరెంట్ ఫార్మాట్ లో రానున్న ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందట.

విద్యాధర్ కగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాలా టాలెంటెడ్ చాందినీ చౌదరి కథానాయిక నటించారు. ఇక వరల్డ్ వైడ్ గా గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని వీ సెల్యులాయిడ్ బ్యానర్ సమర్పిస్తోంది. గామి చిత్రం కోసం నాలుగేళ్లగా పని చేస్తున్నామని హీరో ఇటీవలే విశ్వక్ చెప్పారు. ఈ సినిమాలో ఆయన శంకర్ అనే అఘోరగా నటిస్తున్నారు. మరి ఈ ప్రయోగాత్మకమైన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.