Begin typing your search above and press return to search.

మళ్ళీ డైరెక్టర్ గా విశ్వక్?

ఇప్పటికే ఫలక్ నామా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్.. లైలాకు కూడా ఆయనే డైరెక్టర్ గా వ్యవహరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 6:58 AM GMT
మళ్ళీ డైరెక్టర్ గా విశ్వక్?
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు మాస్ దా కా దాస్ విశ్వక్ సేన్. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న ఆయన.. పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. ఫలక్ నామా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాల దర్శక నిర్మాణ బాధ్యతలు విజయవంతంగా చేపట్టారు విశ్వక్.

ఫలక్ నామా దాస్ సినిమాతో రైటర్ గా కూడా మారిపోయారు విశ్వక్. కొన్ని రోజుల క్రితం, హోమ్ బ్యానర్లు వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ ద్వారా ఇండస్ట్రీకి కొత్త వాళ్లను పరిచయం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా 20 మంది కొత్త ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఈ మూవీలో విశ్వక్ సేన్ నటిస్తున్నారో లేదోనన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

ఇది పక్కన పెడితే.. విశ్వక్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయట. అందులో ఒకటైన గామి మూవీ ప్రెస్ మీట్ లో విశ్వక్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. కల్ట్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామిల్లో ఏ సినిమా కోసం మీరు ఎక్కువ ఇంటెన్స్ గా ఫీలవుతున్నారని అడగ్గా.. ఈ మూడు కాకుండా మరో చిత్రం ఉందని చెప్పారు. ఆ సినిమా పేరు లైలా అని, అందులో తానే లీడ్ రోల్ పోషిస్తున్నట్లు చెప్పారు.

ఇంకా ఈ నాలుగు కాకుండా మరో సినిమా కూడా తన లైనప్ లో ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఐదు సినిమాలు.. ఈ ఏడాదే రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫలక్ నామా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్.. లైలాకు కూడా ఆయనే డైరెక్టర్ గా వ్యవహరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోసారి డైరెక్టర్ కుర్చీ ఎక్కనున్నారని సమాచారం. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. మరిన్ని వివరాలను మేకర్స్ కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారట.

మరోవైపు, గామి మూవీ వరల్డ్‌ వైడ్‌గా మార్చి 8న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా.. వీ సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్ శబరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే గామి డబ్బింగ్ ను విశ్వక్ సేన్‌, చాందినీ చౌదరి పూర్తి చేశారు. మరి విశ్వక్ మిగతా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.