Begin typing your search above and press return to search.

విశ్వ‌క్‌ని అందుకే హోల్డ్‌లో పెట్టారా?

ముందు నుంచే హైప్ క్రియేట్ కావ‌డంతో ఆ స్థాయిలోనే వ‌సూళ్లని రాబ‌డుతూ వంద కోట్ల మార్కు వైపు ప‌రుగులు పెడుతోంది.

By:  Tupaki Desk   |   3 May 2025 3:53 PM
విశ్వ‌క్‌ని అందుకే హోల్డ్‌లో పెట్టారా?
X

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ డ్రామా `హిట్ 3`. భ‌హిట్ ఫ్రాంచైజీలో భాగంగా థ‌ర్డ్ ఇనిస్టాల్‌మెంట్‌గా ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను తెర‌కెక్కించిన ఈ మూవీ ఈ నెల 1న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. కేజీఎఫ్ స్టార్ శ్రీ‌నిధిశెట్టి తొలిసారి నానికి జోడీగా న‌టించిన ఈ సినిమా ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద కాసులు వ‌ర్షం కురిపిస్తోంది. ముందు నుంచే హైప్ క్రియేట్ కావ‌డంతో ఆ స్థాయిలోనే వ‌సూళ్లని రాబ‌డుతూ వంద కోట్ల మార్కు వైపు ప‌రుగులు పెడుతోంది.

డార్క్ వెబ్ సైకోల కోసం హీరో సాగించే వేట నేప‌థ్యంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో `హిట్ 2` హీరో అడ‌వి శేష్ న‌టించి ఆడియ‌న్స్‌ని స‌ర్ప్రైజ్ చేశాడు. క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చి నానికి అండ‌గా నిలిచి ఫైట్ చేయ‌డం ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. అంటే కాకుండా సినిమా ఎండింగ్‌లో `హిట్ 4` కేస్ అంటూ హీరో కార్తి ఎంట్రీ ఇవ్వ‌డం, ఫోర్ట్ పార్ట్‌కు హీరో త‌న‌నేన‌ని క్లారిటీ ఇవ్వ‌డంతో `హిట్ 4`పై అప్పుడే భారీగా లెక్క‌లు వేయ‌డం మొద‌లైంది.

అయితే క్లైమాక్స్‌లో అడివి శేష్‌ని రంగంలోకి దించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను `హిట్‌` హీరో మాస్‌కా దాస్ విశ్వ‌క్‌సేన్‌ని ఎందుకు హోల్డ్‌లో పెట్టార‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం నెట్టింట జోరుగా జ‌రుగుతోంది. అడివి శేష్‌ని దించిన‌ప్పుడు విశ్వ‌క్‌సేన్‌ని దించ‌క‌పోవ‌డం ఏంట‌ని విశ్వ‌క్ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నార‌ట‌. అయితే `హిట్ 4` కోస‌మే విశ్వ‌క్‌ని హోల్డ్‌లో పెట్టార‌ని, ఒకే సినిమాలో ముగ్గురిని చూపిస్తే మ‌జా ఉండ‌ద‌ని, కార్తి సినిమాలో విశ్వక్ సేన్‌ని రంగంలోకి దింపే ఆలోచ‌న‌లో శైలేష్ కొల‌ను ఉన్నాడ‌ని. ఆ కార‌ణంగానే విశ్వ‌క్‌సేన్‌ని `హిట్ 3`లోకి తీసుకురాలేద‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే `హిట్ 4` వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక హిట్ 4 క‌థని లారి మ‌ట్టిలో క‌ప్పి పెట్టిన శ‌వం నేప‌థ్యంలో తెర‌పైకి తీసుకొస్తార‌ని, ఆ హ‌త్య‌ను కార్తి ఎలా ఛేదించాడు? దాని వెన‌కున్న ముఠా ఎవ‌రు అనే కోణంలో `హిట్ 4` సాగే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ టాక్‌.