విశ్వక్ ఫంకి ప్లానింగ్ ఏంటో..?
విశ్వక్ సేన్ తో కయదు జోడీ తెలుగు ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. ఐతే ఫంకీ సినిమా సెట్స్ మీదకు వెళ్లి ఆరు నెలలు పైన అవుతుంది.
By: Tupaki Desk | 5 Jun 2025 7:00 AM ISTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా తర్వాత చేస్తున్న సినిమా ఫంకీ. లైలా అంచనాలను అందుకోకపోవడంతో ఈసారి ష్యూర్ షాట్ హిట్ టార్గెట్ తో వస్తున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ ఫంకీ సినిమాను జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కెవి డైరెక్ట్ చేస్తున్నాడు. శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా తర్వాత విశ్వక్ తో సినిమా చేస్తున్న అనుదీప్ ఈ సినిమా కూడా తన మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటూనే విశ్వక్ సేన్ మాస్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలను పొందుపరుస్తున్నట్టు తెలువ్స్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా డ్రాగన్ బ్యూటీ కయదు లోహార్ ని ఫిక్స్ చేశారు. అంతకుముందే శ్రీ విష్ణుతో అల్లూరి సినిమా చేసిన కయదుని అప్పుడు మనోళ్లు పట్టించుకోలేదు. కానీ డ్రాగన్ సినిమాలో ఆమె గ్లామర్ పర్ఫార్మెన్స్ అన్నీ ఆమెను మళ్లీ ట్రాక్ లోకి వచ్చేలా చేశాయి. డ్రాగన్ తర్వాత కయదుకి అటు తమిళంలో కూడా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ శింబు నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.
విశ్వక్ సేన్ తో కయదు జోడీ తెలుగు ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. ఐతే ఫంకీ సినిమా సెట్స్ మీదకు వెళ్లి ఆరు నెలలు పైన అవుతుంది. అనుదీప్ ప్రతి సినిమాను ఇలా సెట్స్ మీదకు తీసుకెళ్లడమే ఆలస్యం అలా ఆరు నెలల్లో పూర్తి చేసి రిలీజ్ చేస్తాడు. మరి విశ్వక్ సేన్ ఫంకీ విషయంలో ప్లానింగ్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ఫంకీ సినిమా ఈ ఇయర్ లోనే రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఐతే అది దసరా తర్వాత తెస్తారా లేదా డిసెంబర్ లో ప్లాన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
విశ్వక్ సేన్, అనుదీప్ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఫంకీ కచ్చితంగా మాస్ కా దాస్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఫంకీతో హిట్ ట్రాక్ ఎక్కితే మాత్రం విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమాలు కూడా అదిరిపోయేలా ప్లాన్ చేస్తాడని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ సినిమాలు రిలీజ్ ముందు బాగానే బజ్ ఏర్పరచుకుంటాయి కానీ రిలీజ్ తర్వాత ఆశించిన ఫలితాన్ని అందుకోవట్లేదు. గత రెండు మూడు సినిమాల్లో ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అందుకే ఈసారి విశ్వక్ సేన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాట్టు తెలుస్తుంది. అక్కడ ఉంది అనుదీప్ కాబట్టి రిలీజ్ ప్రమోషన్స్ పిచ్చెక్కించడమే కాదు సినిమా కూడా సక్సెస్ రూట్ లోనే వెళ్లేలా చేస్తాడని చెప్పొచ్చు.
