విశ్వక్ ఫంకీ అప్డేట్స్ లేట్ ఏంటి..?
ఆ సినిమా ఒక ప్రయోగంగా తన కెరీర్ లో ప్రత్యేకంగా ఉంటుందని అనుకున్న విశ్వక్ కి పెద్ద షాకే ఇచ్చింది
By: Tupaki Desk | 5 May 2025 3:42 PMమాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా సినిమాతో ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేశాడు. ఆ సినిమా ఒక ప్రయోగంగా తన కెరీర్ లో ప్రత్యేకంగా ఉంటుందని అనుకున్న విశ్వక్ కి పెద్ద షాకే ఇచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ ని ఉద్దేశించి విశ్వక్ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా అనుదీప్ కెవి తో చేస్తున్నాడు. ఈ సినిమాకు ఫంకీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫంకీ సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది.
ఈమధ్యనే ఫారిన్ ట్రిప్ ముగించుకుని వచ్చిన విశ్వక్ ఫంకీ నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఫంకీ సినిమా కథ ఏంటన్నది తెలియదు కానీ జాతిరత్నాలు అనుదీప్ చేస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని ఆడియన్స్ నమ్ముతున్నారు. ఫంకీ సినిమాలో డ్రాగన్ హీరోయిన్ కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. విశ్వక్ సేన్, కయదు జోడీ బాగుంటుందని అంటున్నారు.
జాతిరత్నాలు తర్వాత శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు అనుదీప్. ఆ సినిమా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదన్న టాక్ ఉంది. ఐతే విశ్వక్ సేన్ తో చేసే సినిమా మాత్రం హిట్ టార్గెట్ తోనే చేస్తున్నారని తెలుస్తుంది. ఫంకీ సినిమా విషయంలో విశ్వక్ సేన్ కూడా చాలా ఫోకస్ తో పనిచేస్తున్నారని టాక్. విశ్వక్ సేన్ సినిమాలన్నీ ఈమధ్య అంచనాలు తప్పుతున్నాయి. అందుకే ఇక మీదట సినిమాలు మిస్ ఫైర్ అవ్వకూడదనే ఉద్దేశంతో కష్టపడుతున్నాడు.
అనుదీప్ కి ఒక యూనిక్ కామెడీ స్టైల్ ఉంటుంది. అందుకే అతని సినిమా అంటే చాలు ఆడియన్స్ అంతా కూడా అలర్ట్ గా ఉంటారు. అందులోనూ మాస్ కా దాస్ విశ్వక్ తో అనుదీప్ సినిమా అనేసరికి మరింత క్రేజీగా మారింది. ఈ సినిమా హిట్ పడితే మాత్రం విశ్వక్ సేన్ తో పాటు అనుదీప్ రేంజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. విశ్వక్ సేన్ అనుదీప్ ఫంకీ పూర్తి చేశాకనే మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఒక కథ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.