విశ్వక్ కల్ట్.. అతను పర్ఫెక్ట్ చాయిస్..!
ఈ సినిమా డైరెక్షన్ మాత్రమే కాదు నిర్మాతగా కూడా తనే వ్యవహరిస్తున్నాడు. ఐతే విశ్వక్ సేన్ కల్ట్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తానే అయినా డైలాగ్స్ మాత్రం మరో దర్శకుడు తరుణ్ భాస్కర్ కి ఛాన్స్ ఇచ్చాడు.
By: Tupaki Desk | 12 May 2025 1:30 AMమాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా తర్వాత ఈసారి పక్కా ప్లానింగ్ తో వస్తున్నాడు. లైలా కోసం విశ్వక్ ఎంతో రిస్క్ తీసుకుని మరీ లేడీ గెటప్ వేయగా సినిమా ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమైంది. టాలీవుడ్ యువ హీరోల్లో 100 కోట్లు కొట్టగల సత్తా ఉన్నా కూడా ఎందుకో వెనకపడ్డాడు విశ్వక్ సేన్. అందుకే ఇక మీదట తన మాస్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ అనుదీప్ కెవి డైరెక్షన్ లో ఫంకీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటుంది. డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ ఈ సినిమాలో విశ్వక్ ససన నటిస్తుంది.
ఇక ఈ సినిమాతో పాటుగా విశ్వక్ సేన్ మరో సినిమా షురూ చేశాడు. ఈసారి తన డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ డైరెక్షన్ లో వచ్చిన ఫలక్ నుమా దాస్ మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. ఆ సినిమా చూసే విశ్వక్ కి మాస్ ఆడియన్స్ దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి అతని డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు విశ్వక్ సేన్. కల్ట్ అంటూ క్రేజీ టైటిల్ తో వస్తున్నాడు విశ్వక్ సేన్.
ఈ సినిమా డైరెక్షన్ మాత్రమే కాదు నిర్మాతగా కూడా తనే వ్యవహరిస్తున్నాడు. ఐతే విశ్వక్ సేన్ కల్ట్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తానే అయినా డైలాగ్స్ మాత్రం మరో దర్శకుడు తరుణ్ భాస్కర్ కి ఛాన్స్ ఇచ్చాడు. విశ్వక్ సేన్ తో ఈ నగరానికి ఏమైంది సినిమా చేశాడు తరుణ్ భాస్కర్. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తరుణ్ భాస్కర్ రైటింగ్ కి ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు.
విశ్వక్ సేన్ కల్ట్ కి తరుణ్ భాస్కర్ రైటింగ్ సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఈమధ్య విశ్వక్ సేన్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోతున్నాయి. అందుకే ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో విశ్వక్ సేన్ ఈ కల్ట్ సినిమాను చేస్తున్నాడు. కల్ట్ పోస్టర్ కూడా సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. విశ్వక్ సేన్ ఫంకీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఐతే ఈ కల్ట్ సినిమా మాత్రం నెక్స్ట్ ఇయరే వచ్చే అవకాశాలు ఉన్నాయి.