Begin typing your search above and press return to search.

వాళ్ల‌ను చూసే కూల్ గా ఉండ‌టం నేర్చుకుంటున్నా

లైలా సినిమాతో కొత్త ప్ర‌యోగం చేసిన విశ్వ‌క్ సేన్ ఆ సినిమాతో డిజాస్ట‌ర్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   28 April 2025 6:02 AM
వాళ్ల‌ను చూసే కూల్ గా ఉండ‌టం నేర్చుకుంటున్నా
X

లైలా సినిమాతో కొత్త ప్ర‌యోగం చేసిన విశ్వ‌క్ సేన్ ఆ సినిమాతో డిజాస్ట‌ర్ అందుకున్నాడు. ఆ సినిమాతో ఎలాంటి సినిమాలు చేయాలో విశ్వ‌క్ కు ఓ క్లారిటీ వ‌చ్చి, ఇక‌పై ప్ర‌తీ సీన్ ను ఎంతో బాధ్య‌త‌గా చేస్తాన‌ని, ఆడియ‌న్స్ మెచ్చే సినిమాలే చేస్తాన‌ని అంద‌రికీ మాటిచ్చాడు. అయితే లైలా ఫ్లాప్ త‌ర్వాత బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌ని విశ్వ‌క్ సేన్ తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని చేసిన‌ హిట్3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వ‌చ్చాడు.

ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్ మాట్లాడుతూ, త‌న వ‌య‌సు ఇప్పుడే 30కు చేరింద‌ని, ఇన్ని రోజులూ త‌న స్పీడ్ కాస్త ఎక్కువైంద‌ని, ఇప్పుడిప్పుడే కూల్ గా ఉండ‌టానికి ట్రై చేస్తున్నాన‌ని, ఊరికే అటూ ఇటూ పరిగెత్తుతుండ‌టంతో ఆ కూల్ త‌గ్గిపోతుంద‌ని.. నాని, అడివి శేష్ నుంచి కూల్ గా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాన‌ని విశ్వ‌క్ సేన్ చెప్పుకొచ్చాడు.

హిట్3 గురించి మాట్లాడుతూ, హిట్ సిరీస్ నాది, హిట్ సిరీస్ శేష్ అన్న‌ది, హిట్ సిరీస్ నాని అన్న‌ది, హిట్ సిరీస్ అంద‌రిదీ అని భావిస్తున్నాన‌ని, హిట్1 తో హిట్ యూనివ‌ర్స్ మొద‌లైంద‌ని, త‌న కెరీర్లో హిట్1 చాలా ముఖ్య‌మైన‌ద‌ని, హిట్3 త‌న‌ బిడ్డ కూడా అని ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్ అన్నాడు. ఈ సినిమా క‌చ్ఛితంగా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేశాడు విశ్వ‌క్.

శైలేష్ ఈ హిట్ సిరీస్ లో ఓ డ‌జ‌ను సినిమాలు తీస్తాడ‌ని, త్వ‌ర‌లోనే తాను కూడా ఈ సిరీస్ లో తిరిగి క‌నిపించాల‌ని కోరుకుంటున్నాన‌ని, విక్ర‌మ్ రుద్ర‌రాజు పాత్ర ఇంకా ముగిసిపోలేద‌ని, విక్ర‌మ్ రుద్ర‌రాజు సాల్వ్ చేయాల్సిన కేసులు ఇంకా చాలా ఉన్నాయ‌ని చెప్పి హిట్ సిరీస్ పై మ‌రింత హైప్ పెంచాడు విశ్వ‌క్. నాని గురించి మాట్లాడుతూ, ఆల్రెడీ హీరోగా, నిర్మాత‌గా స‌క్సెస్ అయిన నాని హ్యాట్రిక్ అందుకున్నాడని, హిట్3 తో డ‌బుల్ హ్యాట్రిక్ ను మొద‌లుపెట్ట‌బోతున్నాడ‌ని విశ్వ‌క్ అన్నాడు.

ఇదే ఈవెంట్ లో యాంక‌ర్ సుమ స్టేజ్ పై అడిగిన ప్ర‌శ్న‌కు కూడా విశ్వ‌క్ స‌మ‌ధాన‌మిచ్చాడు. మీ పెళ్లి ఎప్పుడు అని సుమ, విశ్వ‌క్ ను అడ‌గ్గా మొన్న‌నే మా ఇంట్లో అమ్మ‌కు పెళ్లి సంబంధాలు చూడ‌మ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చా అని, ఎప్పుడు కుదిరితే అప్పుడు పప్ప‌న్నం పెడ‌తాన‌ని విశ్వ‌క్ చెప్పాడు. ఇక విశ్వ‌క్ కెరీర్ విష‌యానికొస్తే ప్ర‌స్తుతం అత‌ను ఫంకీ, VS13 సినిమాలతో బిజీగా ఉన్నాడు.