Begin typing your search above and press return to search.

భక్త కన్నప్ప.. అక్షయ్ జెట్ స్పీడ్ లోనే..

గత ఏడాది 3 చిత్రాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు.

By:  Tupaki Desk   |   3 May 2024 7:23 PM GMT
భక్త కన్నప్ప.. అక్షయ్ జెట్ స్పీడ్ లోనే..
X

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ స్టార్స్ లో ఏడాదికి 4 నుంచి 5 సినిమాల వరకు చేస్తోన్న వారి గురించి వెతికితే ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే కనిపిస్తాడు. 2022లో అక్షయ్ కుమార్ నుంచి ఏకంగా 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత ఏడాది 3 చిత్రాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు.


ఈ ఏడాది ఒక మూవీ రిలీజ్ కాగా మరో ఆరు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో నాలుగు సినిమాల వరకు గ్యారెంటీగా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్నవే కావడం విశేషం. వీటిలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కూడా ఉంది. భారీ బడ్జెట్ తో ఇండియా రేంజ్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

100 కోట్లకి పైగా బడ్జెట్ తో కన్నప్ప చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మహా శివుడి భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథగా ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. చారిత్రక ఆధారాలని బేస్ చేసుకొని కొద్దిగా ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి కన్నప్ప చిత్రాన్ని దృశ్యరూపంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో మహా విష్ణువుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు.

అలాగే మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ని కూడా ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. గతంలో మంచు విష్ణు అఫీషియల్ గా ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ తాజాగా అతనికి సంబందించిన సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడంట.

మంచు విష్ణు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. అక్షయ్ కుమార్ తో షూటింగ్ అనుభవం చాలా అద్భుతంగా, సరదాగా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు అతని యాక్షన్ మిస్ అవుతున్నామని పోస్ట్ చేశారు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా సిద్ధమవుతోన్న కన్నప్ప సినిమాపై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కచ్చితంగా అతని కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాడు. మరి అతని అంచనాలని కన్నప్ప ఏ మేరకు నిలబెడుతుందనేది చూడాలి.