Begin typing your search above and press return to search.

యూట్యూబర్లకు విష్ణు వార్నింగ్‌.. 48 గంటల్లోపు డిలీట్ చేయకపోతే!

తండ్రీకూతురిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోను పోస్ట్‌ చేసిన యూట్యూబర్లపై మండిపడ్డారు.

By:  Tupaki Desk   |   10 July 2024 4:26 PM GMT
యూట్యూబర్లకు విష్ణు వార్నింగ్‌.. 48 గంటల్లోపు డిలీట్ చేయకపోతే!
X

సినిమా హీరోహీరోయిన్లపై పోస్ట్ చేసిన ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేయకపోతే తగిన చర్చలు తీసుకుంటామని హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. మ‌హిళ‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెడితే అస్సలు ఊరుకోబోమ‌ని తెలిపారు. తండ్రీకూతురిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోను పోస్ట్‌ చేసిన యూట్యూబర్లపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

"అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళు అంటే చాలా మర్యాదస్తులు. పద్ధతిగా ఉంటారు. ట్రెడిషన్ ను ఫాలో అవుతారు అని అని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది తెలుగు వాళ్ళు యూట్యూబ్ లోనూ, ఇన్ స్టాగ్రామ్ లోనూ, ట్విట్టర్ లోనా అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఒక రెండు మూడు రోజుల క్రితం నా తమ్ముడు సాయి ధరమ్ తేజ్ ప్రణీత్ హన్మంతు అనే వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడని క్వశ్చన్ చేసేసరికి.. అది ఎంత జుగుప్సగా ఉండిందంటే ఆ వీడియో.. తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ.. రియాక్ట్ అయ్యి వీళ్లందరూ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. వారందరికీ థ్యాంక్స్. ప్రణీత్ హన్మంతు ఓ మంచి కుటుంబం నుంచి వచ్చిన వారు. ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేశారో అర్థం కాలేదు. ఆయన, ఆయన ఫ్రెండ్స్ కు దాంట్లో ఆనందం ఏముంది" అని ప్రశ్నించారు.

"ఒక చంటి బిడ్డ.. ఆ బిడ్డకు రెండు మూడు సంవత్సరాలు కూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సె*క్సువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది. అసలు దాని గురించి మాటలు ఆడుతుంటేనే వింటుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అది చాలా తప్పు. మన తెలుగు వాళ్లం.. అలాంటి వాళ్లం కాదు. ఒక రెండు మూడు రోజులుగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కు లెటర్స్, ఈమెయిల్స్ వచ్చాయి. నటీనటులంతా యాక్షన్ తీసుకోవాలని చెబుతున్నారు"

"తప్పుడు వీడియోలు చేస్తున్న వారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా.. ఒక ఆడదంటే ఓన్లీ సె*క్సువల్ గానే చూడాలా? మదర్ లేరా? సిస్టర్ లేరా? లేదా మీ వైఫ్ కానీ డాటర్ గానీ లేరా? సృష్టికి మూల కారణం ఆడది.. శక్తి. వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్.. మేమందరం శిరస్సు వచ్చి నమస్కరిస్తాం. ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము" అని తెలిపారు.

"బట్ ఒక హీరోయిన్ ను ఇష్టమొచ్చినట్టు మాటలు అనేది.. ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసేది.. డార్క్ హ్యూమర్ అని.. ట్రోలింగ్ వీడియోస్ అని.. దానికింద మీరు దాక్కొనేది.. అది అస్సలు కరెక్ట్ కాదు. నిన్న బ్రహ్మానందం గారు నాకు కాల్ చేసి మాట్లాడారు. రేయ్ విష్ణు.. మీమ్స్ లో నా ఫోటోలు వాడుకుంటున్నారు. అలాంటివి నేను ఎంజాయ్ చేస్తాను. కానీ జుగుప్సాకర వీడియోస్ లో కూడా వాడుతున్నారు. ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి బాధపడ్డారు"

"నేను సిన్సియర్ అప్పీల్ చేస్తున్నా.. యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ వేసేవారికి.. ట్రోలింగ్ వీడియోస్ వేసేవారికి.. హీరోహీరోయిన్లపై అసభ్యకరంగా మాట్లాడేవారికి.. నా వీడియో వచ్చిన 48 గంటల్లో వాటిని తీసేయండి. లేకుంటే సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తాం. మీ యూట్యూబ్ ఛానెల్ కూడా బ్యాన్ అయ్యే లాగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, ఆంధ్రా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి.. 'మా' తరపున సపోర్ట్ గా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం” అని తెలిపారు. ప్రస్తుతం విష్ణు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.