Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోల‌పై విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అలాగే డార్లింగ్ ప్ర‌భాస్ ఇండియాలోనే భారీ పారితోషికం తీసుకునే న‌టుడు అని..ఆ రేంజ్ లో త‌న సినిమాల‌న్నీ రిలీజ్ అవుతాయ‌న్నాడు.

By:  Tupaki Desk   |   24 March 2024 1:30 AM GMT
టాలీవుడ్ హీరోల‌పై విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

మంచు వార‌సుడు విష్ణు `క‌న్న‌ప్ప` ప్రాజెక్ట్ తో వైర‌ల్ సెన్షేష‌న్ గా మారిన సంగ‌తి తెలిసిందే. డ్రీమ్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌డం ఆల‌స్య‌మైన ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి మాత్రం ఒకటే హైప్ తీసుకొస్తున్నారు. దానికి తోడు సినిమాలో అగ్ర హీరోలు...న‌టులు న‌టించ‌డంతో క‌న్న‌ప్ప‌పై బ‌జ్ బాగానే క‌నిపిస్తుంది. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు కూడా మంచి హైప్ తీసుకొస్తున్నాయి. పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తోన్న ఈ సినిమా విషయంలో మంచు అండ్ కో పిన్ టూ పిన్ అన్ని ర‌కాల జాగ్రత్త‌ల‌తో ముందుకెళ్తున్నారు.

చిత్రీక‌ర‌ణ అంతా న్యూజిలాండ్ లో చేయ‌డం మ‌రింత పాజిటివ్ గా మారింది. ఇలా అన్ని ర‌కాలుగా మంచు వారబ్బాయి పేరు నెట్టింట జోరుగానే వైర‌ల్ అవుతోంది. గ‌త ప‌రాజ‌యాల‌తో సంబంధం లేకుండా పాజిటివ్ గా ముందుకెళ్తున్నాడు. తాజాగా తెలుగు నుంచి పాన్ ఇండియాలో మార్కెట్ ఉన్న హీరోల గురించి విష్ణు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. మెగాస్టార్ చిరంజీవి ప‌ద్మ‌విభూష‌ణ్ అందుకున్నార‌ని..అదే ఫ్యామిలీ నుంచి స్టార్ అయిన బ‌న్నీ కేర‌ళ‌లో అసాధార‌ణ‌న ఫాలోయింగ్ ఉన్న న‌టుడ‌న్నారు.

అలాగే డార్లింగ్ ప్ర‌భాస్ ఇండియాలోనే భారీ పారితోషికం తీసుకునే న‌టుడు అని..ఆ రేంజ్ లో త‌న సినిమాల‌న్నీ రిలీజ్ అవుతాయ‌న్నాడు. ప్ర‌పంచ దేశాలెన్నో మన సినిమా రిలీజ్ కోసం ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తాయ‌ని పేర్కొన్నాడు. ఇక సూపర్ స్టార్ మ‌హ‌ష్ ని నా బ్ర‌ద‌ర్ అంటూ సంబోధించాడు. మ‌హేష్ న‌టిస్తోన్న 29వ చిత్రం ఇండియాలోనే అతి పెద్ద చిత్రం అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసాడు.

అయితే విష్ణు న‌టిస్తోన్న `క‌న్న‌ప్ప` వివ‌రాలు మాత్రం హైడ్ చేసాడు. అవి మాత్రం రిలీజ్ వ‌ర‌కూ స‌స్పెన్స్ అంటూ క్యూరియాసిటీని పెంచేసాడు. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్ లో చిత్రీర‌ణ మొద‌లైన నాటి నుంచి ఏక‌ధాటిగా షెడ్యూల్స్ చేసారు. ఇటీవలే విరామం ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది.