Begin typing your search above and press return to search.

బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ కపుల్‌

ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్‌, బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా 2021 ఏప్రిల్‌ 22న పెళ్లి చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2025 4:29 PM IST
బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ కపుల్‌
X

ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్‌, బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా 2021 ఏప్రిల్‌ 22న పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే ఇద్దరికీ పెళ్లిలు అయ్యాయి. వ్యక్తిగత కారణాల వల్ల వారి జీవిత భాగస్వామ్యుల నుంచి విడాకులు తీసుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను వివాహం చేసుకున్న జ్వాలా గుత్తా ఆరేళ్లు కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకుంది. ఇద్దరి విడాకులకు సంబంధించిన కారణం గురించి ఎలాంటి విషయం బయటకు రాలేదు. కానీ ఇద్దరూ కలిసి ఉన్నంత కాలం విభేదాలతోనే సరిపోయిందని వారి సన్నిహితులు అంటూ ఉంటారు. ఇద్దరు వైవాహిక బంధం కారణంగా ఆట కూడా దెబ్బ తిన్నదని అంటూ ఉంటారు.


జ్వాలా గుత్తా, చేతన్‌కి విడాకులు ఇస్తే నటుడు విష్ణు విశాల్ సైతం రజనీ నటరాజన్‌ ను 2011లో వివాహం చేసుకుని, ఏడు సంవత్సరాలు కలిసి ఉన్నారు. విష్ణు విశాల్‌, రజనీలకు ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇద్దరు సింగిల్‌గా జీవితాన్ని లీడ్‌ చేస్తున్న సమయంలోనే కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా కలిశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇద్దరూ పెద్దలను ఒప్పించి 2021లో పెళ్లి పీటలు ఎక్కారని వీరి ప్రేమ కథ గురించి మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. వివాహం జరిగిన నాలుగు ఏళ్లకు వీరికి పాప జన్మించింది. ఆ విషయాన్ని విష్ణు విశాల్ అధికారికంగా ప్రకటించాడు.

వివాహ వార్షికోత్సవం రోజే విష్ణు విశాల్‌, జ్వాలా గుత్తాలు తల్లిదండ్రులు కావడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విష్ణు విశాల్‌ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పాప చేయిని ఇన్‌స్టాలో షేర్‌ చేసిన విష్ణు విశాల్‌ తన కొడుకు ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. వివాహ వార్షికోత్సవం రోజే ఇలాంటి వార్త వినడం చాలా సంతోషంగా ఉందని కూడా విష్ణు విశాల్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. మొత్తానికి విష్ణు విశాల్‌, జ్వాలా గుత్తాల కొత్త ప్రయాణంకు, వారిద్దరు తల్లిదండ్రులు అయినందుకు గాను సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

విష్ణు విశాల్ సినిమాల విషయానికి వస్తే చివరగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య పాత్రలో నటించిన లాల్‌ సలామ్‌ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయన పలు తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాలకు మంచి స్పందన వస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. తెలుగులోనూ ఈయనకు మంచి క్రేజ్ ఉంది. కనుక భవిష్యత్తులో తప్పకుండా డైరెక్ట్‌ తెలుగు సినిమాల్లో హీరోగా లేదా విలన్‌గా అయినా నటించే అవకాశాలు ఉన్నాయి.