Begin typing your search above and press return to search.

కన్నప్ప టీమ్ ప్రభాస్ తో ఆ పని చేయించాల్సిందే..?

మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన కన్నప్ప మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 8:00 AM IST
కన్నప్ప టీమ్ ప్రభాస్ తో ఆ పని చేయించాల్సిందే..?
X

మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన కన్నప్ప మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భక్త కన్నప్ప కథను నేటి ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో కన్నప్ప సినిమా మొదలు పెట్టారు మంచు ఫ్యామిలీ. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కన్నప్ప సినిమాలో మంచు విష్ణు విష్ణు టైటిల్ రోల్ పోషించగా సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు లాంటి స్టార్స్ కూడా భాగం అయ్యారు.

అసలైతే ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సిన కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు మంచు విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. కన్నప్ప సినిమాతో తిరిగి కెరీర్ లో సూపర్ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు మంచు విష్ణు. ఐతే కన్నప్ప సినిమా ముంబై ప్రెస్ మీట్ లో అక్షయ్ కుమార్ ఒకటి రెండుసార్లు కనిపించాడు. ఇటీవల గుంటూరులో జరిగిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం మంచ్ విష్ణు, మోహన్ బాబు మిగతా కన్నప్ప టీం సమక్షంలో జరిగింది.

ప్రభాస్ కన్నప్పలో ఉన్నాడని తెలిసే ఫ్యాన్స్ ఆ సినిమా మీద ఫోకస్ చేస్తున్నారు. ఐతే ఇప్పటివరకు కన్నప్పకు సంబంధించిన ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొనలేదు. సినిమా రిలీజ్ కు ఇంకా 17 రోజులు మాత్రమే ఉంది కాబట్టి కన్నప్ప కోసం ప్రభాస్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయిస్తే కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మరి ప్రభాస్ ఆ ఇంటర్వ్యూకైనా టైం ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

ప్రభాస్ కూడా రాజా సాబ్ ని పూర్తి చేసి అనుకున్న డేట్ కి రిలీజ్ అయ్యేలా ప్రయత్నిస్తున్నాడు. మరోపక్క ఫౌజీ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఫ్యాన్స్ తన సినిమాల కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని గుర్తించిన ప్రభాస్ ఇక మీదట స్పీడ్ పెంచాలని ఫిక్స్ అయ్యాడు. ఐతే కన్నప్ప లో రుద్ర పాత్రలో నటించిన ప్రభాస్ ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా సపోర్ట్ అందిస్తే సినిమాకు కావాల్సినంత బజ్ వస్తుంది. మరి మంచు విష్ణు ప్రభాస్ ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొనేలా చూస్తాడా లేదా అన్నది చూడాలి. కన్నప్ప సినిమా మీద మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.