కన్నప్ప: ఇప్పుడు విష్ణు ఎదుర్కొంటున్న అసలు సమస్య ఇదే..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
By: Tupaki Desk | 30 Jun 2025 3:19 PM ISTమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఒక యోధుడి నుంచి భక్తునిగా మారే తిన్నడు కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలుస్తోంది. మోహన్ బాబు నిర్మాణంలో, ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా విజయం దిశగా ముందుకు సాగుతోంది.
అయితే సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ సమయంలో, హీరో విష్ణు మంచు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్లు బయటపెట్టాడు. అదే ‘కన్నప్ప’ పై పెరిగిపోతున్న పైరసీ ముప్పు. సోషల్ మీడియాలో విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “కన్నప్ప పై పైరసీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే 30,000 పైగా లింకులు తొలగించాం. ఇది హృదయవిదారకమైన విషయం,” అంటూ ట్వీట్ చేశారు.
“పైరసీ అనేది దొంగతనం. మన పిల్లలకు దొంగతనం చెయ్యొద్దని నేర్పిస్తాం. అయితే పైరసీ కంటెంట్ చూడటం కూడా అదే దొంగతనం. దయచేసి దీన్ని ప్రోత్సహించొద్దు. సినిమా పరిశ్రమను సరైన మార్గంలో ఆదరించండి,” అంటూ విజ్ఞప్తి చేశారు విష్ణు. ఈ ట్వీట్ ద్వారా ఆయన ప్రేక్షకులకు చట్టబద్ధమైన మార్గంలో సినిమాను వీక్షించాలని స్పష్టం చేశారు.
ఇంతకుముందు విష్ణు మంచు ‘కన్నప్ప’ రిలీజ్‌కు ముందు దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం ద్వారా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించినట్లు వెల్లడించారు. “బారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలయాలూ దర్శించుకున్నాను. చివరిగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత నా ఆధ్యాత్మిక యాత్ర పూర్తయింది,” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ చిత్రం ద్వారా విష్ణు తిన్నడు అనే పాత్రలో నటించాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ లార్డ్ శివ పాత్రలో, మోహన్‌లాల్ కిరాత రూపంలో, ప్రభాస్ రుద్ర పాత్రలో నటించారు. ప్రీతి ముఖుందన్ హీరోయిన్‌గా నటించారు. ఇక సాఫ్ట్ ట్యూన్స్ అందించిన సంగీత దర్శకుడు స్టెఫెన్ దేవసీ, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా, హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో సినిమాటోగ్రఫీ చేసిన షెల్డన్ చౌ, ఎడిటర్ ఆంటనీ తదితరుల హంగులతో ఈ సినిమా స్థాయిని మరింతగా పెంచింది.
ప్రస్తుతం పైరసీ సమస్యతో చిత్రబృందం కొంత ఇబ్బందికి గురవుతున్నా… ఫ్యాన్స్ సహకారంతో ఈ సమస్యపై విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నారు. సినిమా చూసే ప్రేక్షకులు థియేటర్ లేదా లీగల్ ప్లాట్‌ఫామ్‌లలో చూసి సినిమా పరిశ్రమను గౌరవించాలని విష్ణు చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హైలైట్ అవుతోంది. ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
