Begin typing your search above and press return to search.

విష్ణుకు ఒకే ఆప్ష‌న్ 'అసెంబ్లీ రౌడీ' సీక్వెల్

విష్ణు మంచు న‌టించిన భారీ చిత్రం `కన్నప్ప` ఈ నెలాఖ‌రున‌ విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

By:  Tupaki Desk   |   4 Jun 2025 5:30 PM
Vishnu Manchu Picks ‘Assembly Rowdy’ as Next Remake
X

విష్ణు మంచు న‌టించిన భారీ చిత్రం `కన్నప్ప` ఈ నెలాఖ‌రున‌ విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. విష్ణు స్వ‌యంగా నిర్మించారు. ఇది పౌరాణికం, భ‌క్తి ప్ర‌ధానంగా సాగే సినిమా. ప‌ర‌మ‌శివుని కృపాక‌టాక్షం కోసం త‌పించే భ‌క్త క‌న్న‌ప్ప క‌థ‌ను వెండితెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అగ్ర‌తార‌ల‌తో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ అరుదైన అవ‌కాశాన్ని న‌టుడు కం నిర్మాత‌ విష్ణు స‌ద్వియోగం చేసుకున్నాడా లేదా? అనేది తెలిసే రోజు ఇంకెంతో దూరంలో లేదు.

పాన్ ఇండియా రిలీజ్‌లో భాగంగా దేశవ్యాప్త ప్రమోషనల్ టూర్‌లో ఉన్న‌ విష్ణు ఇటీవల మీడియాతో సంభాషించారు. ఈ ముచ్చ‌ట్ల‌లో ఒక‌వేళ క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు సినిమాల్లో ఏదో ఒక దానిని రీమేక్ చేయాల్సి వ‌స్తే దేనిని ఎంచుకుంటారు? అని మీడియా ప్ర‌శ్నించింది. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ...ఎం.బి న‌టించిన‌ కల్ట్ క్లాసిక్ అసెంబ్లీ రౌడీని ఎంచుకుంటానని విష్ణు చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ ఏదో ఒక‌రోజు చిత్రీక‌ర‌ణ‌కు వెళితే, `దసరా` చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల ఈ రీమేక్‌కు ద‌ర్శ‌క‌త్వం వహించాలని కోరుకుంటున్నానని విష్ణు చెప్పాడు. ఇక పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో రూపొందించిన అసెంబ్లీ రౌడీలో మంచు మోహ‌న్ బాబు ప‌వ‌ర్ ప్యాక్డ్ డైలాగులు, న‌ట‌న‌ను అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ రేంజులో పెర్ఫామ్ చేయ‌డం, ప‌రుచూరి రేంజు సంభాష‌ణ‌లు రీక్రియేట్ చేయ‌డం అనేది ఇత‌రుల‌కు సాధ్య‌మేనా? ఎంబి అభిమానులు దీనిని అంగీక‌రిస్తారా? అన్న‌ది ఒక స‌వాల్‌.

`క‌న్న‌ప్ప` కోసం ఇప్ప‌టికే మంచు విష్ణు భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక‌లో ప్ర‌భాస్ స‌హా ప‌లువురు అగ్ర తార‌లు అతిథులుగా అటెండ‌వుతార‌ని స‌మాచారం. ప్ర‌భాస్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు ఈవెంట్ కి అటెండ‌వ్వ‌డం క‌లిసొస్తుంద‌ని విష్ణు బృందం భావిస్తోంది. ఈ భారీ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ త‌దిత‌రులు న‌టించారు.