లడ్డూ మామ అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా?
ఇక అసలు విషయానికొస్తే మ్యాడ్, మ్యాడ్ స్వ్కేర్ సినిమాల్లో బాగా నవ్వించిన పాత్రల్లో లడ్డూ క్యారెక్టర్ ఒకటి.
By: Tupaki Desk | 3 April 2025 8:18 PM ISTమ్యాడ్, మ్యాడ్ స్వ్కేర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్లు అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ ఆడియన్స్ ను బాగా నవ్వించడంతో పాటూ ఎంటర్టైన్ చేయగలిగాయి. మార్చి 28న రిలీజైన మ్యాడ్ స్వ్కేర్ మూవీ ఇప్పటికే రూ.75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయింది. త్వరలోనే మ్యాడ్ స్వ్కేర్ రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
ఇక అసలు విషయానికొస్తే మ్యాడ్, మ్యాడ్ స్వ్కేర్ సినిమాల్లో బాగా నవ్వించిన పాత్రల్లో లడ్డూ క్యారెక్టర్ ఒకటి. ఈ రెండు సినిమాల్లో లడ్డూ క్యారెక్టర్ బాగా వర్కవుటై కామెడీ బాగా పండింది. అయితే లడ్డు అసలు పేరు విష్ణు. అతనెప్పటి నుంచో సినిమాల్లో ఉన్నాడు. విష్ణు కూడా విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణల బ్యాచ్ లో వాడే.
తరుణ్ భాస్కర్ మొదట్లో డైరెక్ట్ చేసిన సైన్మా షార్ట్ ఫిల్మ్ లో కూడా విష్ణు యాక్ట్ చేశాడు. అంతేకాదు విష్ణు మంచి ఫోటోగ్రాఫర్ కూడా. అప్పుడప్పుడు విష్ణు తాను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. డిగ్రీ టైమ్ నుంచే ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన విష్ణు ఇప్పుడు బిజీ కమెడియన్ గా మారిపోయాడు.
ఇదిలా ఉంటే విష్ణు అసలు సినిమాల్లోకి వచ్చింది విజయ్ దేవరకొండ ద్వారా అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. డిగ్రీ కాలేజ్ విజయ్ కు విష్ణు సబ్ జూనియర్. మొదట్లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసిన విష్ణు గురించి విజయ్, ట్యాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చాలా గొప్పగా చెప్పాడు. తాను లైఫ్ లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడే విష్ణు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్ తో బిజీగా ఉండేవాడని, చాలా టాలెంటెడ్ అని, బయట కూడా సరదాగా ఉండేవాడని, అలా తనకు ఫ్రెండ్ అయ్యాడని, ట్యాక్సీవాలాలో ఓ రోల్ కు విష్ణు అయితే సరిగ్గా సరిపోతాడనిపించి అతన్ని తీసుకున్నట్టు చెప్పిన విజయ్, ఫ్యూచర్ లో విష్ణు చాలా బాగా సెటిలవుతాడని చెప్పాడు.
అప్పుడు విజయ్ చెప్పినట్టే ఇప్పుడు విష్ణు వరుస సినిమాలతో బిజీ అవడంతో పాటూ కమెడియన్ గా మంచి పొజిషన్ లోనే ఉన్నాడు. ట్యాక్సీవాలాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విష్ణు, ఆ తర్వాత రామన్న యూత్, మ్యాడ్, కీడాకోలా, హ్యాపీ ఎండింగ్, సరిపోదా శనివారం, డార్లింగ్, మా నాన్న సూపర్ హీరో, మ్యాడ్ స్వ్కేర్ సినిమాలతో మంచి కమెడియన్ గా ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు. మ్యాడ్ సినిమాకు విష్ణు బెస్ట్ కమెడియన్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా తీసుకున్నాడు.
