Begin typing your search above and press return to search.

రత్నం ట్రైలర్ టాక్… విశాల్ మాస్ జాతర

తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. తమిళనాడు, ఆంధ్రా బోర్డర్ లో గ్రామాల మధ్య జరిగిన కథగా స్టోరీని రిప్రజెంట్ చేశారు.

By:  Tupaki Desk   |   15 April 2024 2:04 PM GMT
రత్నం ట్రైలర్ టాక్… విశాల్ మాస్ జాతర
X

తమిళ్ స్టార్ హీరో విశాల్ డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. మాస్ సి;నిమా అయిన, కంటెంట్ బేస్డ్ మూవీ అయిన విశాల్ తన క్యారెక్టర్ కి 100 శాతం న్యాయం చేస్తాడు. సింగం సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో విశాల్ రత్నం అనే మూవీ చేశాడు.

కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమాని హరి తెరకెక్కించారు. ఏప్రిల్ 26న తెలుగు, తమిళ్ భాషలలో ఈ సినిమాలో రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. తమిళనాడు, ఆంధ్రా బోర్డర్ లో గ్రామాల మధ్య జరిగిన కథగా స్టోరీని రిప్రజెంట్ చేశారు. ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రేమించే అమ్మాయి కోసం దేనికైనా తెగించే వాడిగా ఈ మూవీలో రత్నం క్యారెక్టర్ లో విశాల్ నటించాడు. సముద్రఖని, మురళీ శర్మ ఇతర పాత్రలలో కనిపించారు. ఈ ట్రైలర్ ని కంప్లీట్ గా యాక్షన్ సీక్వెన్స్ తో డైరెక్టర్ హరి నింపేశారు. హరి సినిమాలంటేనే ఆడియన్స్ హెవీ యాక్షన్ సన్నివేశాలు ఎక్స్ పెక్ట్ చేస్తారు. దానికి తగ్గట్లుగానే ట్రైలర్ ని డిజైన్ చేశారు.

తమిళనాడు నుంచి తిరుపతిని వేరు చేసే సమయంలో ఒక ప్రేమ జంట జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో ఆంధ్రా, తమిళనాడు మధ్య గొడవలని దర్శకుడు హరి హైలైట్ చేసినట్లు ఉన్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షన్ సన్నివేశాలు చిత్రంలో ఎక్కువగానే ఉన్నాయి.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ట్రైలర్ బట్టి చూస్తుంటే సినిమాలో కావాల్సినంత లవ్ ఎమోషన్ తో పాటుగా ప్రేక్షకులు కోరుకునే పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉండబోతున్నాయని అర్ధమవుతోంది. ఈ సినిమాకి కన్నల్ కన్నన్, పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరామన్, విక్కీ స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా ఉన్నారు. గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు.

పవర్ ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా విశాల్ నుంచి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మాస్ యాక్షన్ కథలు ఈ మధ్యకాలంలో పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో రత్నం సినిమాకి విలేజ్ ఆడియన్స్ ని మెప్పించే స్కోప్ ఉంది. ఆంధ్రా, తమిళనాడు మధ్య గొడవలని హైలైట్ చేస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాల ఆడియన్స్ రిలేట్ చేసుకునే ఛాన్స్ ఉంది.