Begin typing your search above and press return to search.

సీబీఐ ఆఫీస్ లో విశాల్..రియ‌ల్ లైఫ్ లో పోరాటం

`మార్క్ ఆంటోనీ` చిత్రానికి సెన్సాన్ స‌ర్టిఫై చేసేందుకు త‌న వ‌ద్ద అధికారులు లంచం తీసుకున్నార‌ని...ఇదే అన్యాయం అంటూ మీడియాలో త‌న బాధ‌ని వ్య‌క్తం చేసారు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 11:39 AM GMT
సీబీఐ ఆఫీస్ లో విశాల్..రియ‌ల్ లైఫ్ లో పోరాటం
X

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ పై న‌టుడు విశాల్ ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. `మార్క్ ఆంటోనీ` చిత్రానికి సెన్సాన్ స‌ర్టిఫై చేసేందుకు త‌న వ‌ద్ద అధికారులు లంచం తీసుకున్నార‌ని...ఇదే అన్యాయం అంటూ మీడియాలో త‌న బాధ‌ని వ్య‌క్తం చేసారు. తాజాగా ఈ కేసు విష‌యంలో విశాల్ సీబీఐ ఎద‌టు హాజ‌ర‌య్యారు. ఈ విష‌యాన్ని ఎక్స్ లో లో తెలిపారు.

`నాకు ఇదొక కొత్త ఎక్స్ పీరియ‌న్స్. విచారించిన తీరుపై సంతృప్తిగా ఉన్నాను. సీబీఐ కార్యాల‌యం ఎలా ఉండాలి అనే దానిపై కూడా వాళ్లు సూచ‌న‌లు తీసుకున్నారు. జీవితంలో ఎప్పుడూ సీబీఐ ఆఫీస్ కి వెళ్తాన‌ని అనుకోలేదు. రీల్ లైప్ లోనే కాదు..రియ‌ల్ లైఫ్ లోనూ అవినీతిపై పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని` రాసుకొచ్చారు. మొత్తానికి విశాల్ ఆరోప‌ణ‌లో నేప‌థ్యంలో సీబీఐ రంగంలోకి దిగి కేసుని డీల్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే విశాల్ ఎవ‌రెవ‌ర‌కి డబ్బులిచ్చారు? అన్నకోణంలో సీబీఐ విచారిస్తుంది.

విశాల్ న‌టించిన `మార్క్ ఆంటోనీ` రిలీజ్ స‌మ‌యంలో హిందీ వెర్ష‌న్ కి సంబంధించి సెన్సార్ లంచం తీసుకుందంటూ విశాల్ ఆరోపించారు. 6.5 ల‌క్ష‌లు లంచం తీసుకున్నార‌ని...భ‌విష్య‌త్ లో మ‌ళ్లీ ఏ సినీ నిర్మాత‌ల‌కు ఇలాంటి ప‌రిస్థితి రాకూడ‌ద‌ని..త‌న ప‌రిస్థితే అలా ఉందంటే చిన్న సినిమా ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించ‌గ‌ల‌ను అంటూ మండిప‌డ్డారు. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసారు.

ఇది నెట్టింట వైర‌ల్ అయింది. కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి విశాల్ ఆవేద‌న చేరింది. దీంతో ప్ర‌భుత్వం క‌మిటీ ఏర్పాటు చేయ‌డం..విచారించ‌డం జ‌రిగింది. అలాగే తాజాగా రంగంలోకి సీబీఐ కూడా దిగ‌డంతో అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అభిమానులు భావిస్తున్నారు.