12 షోలు పూర్తయ్యే వరకు నో రివ్యూస్..!
ఇదే విషయాన్ని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చెప్పుకొచ్చారు. సినిమా రివ్యూలపై విశాల్ లేటెస్ట్ గా స్పందించారు. సినిమాకు బ్రతికించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
By: Tupaki Desk | 17 July 2025 6:17 PM ISTసినిమా ఫలితాలు రివ్యూల మీద ఆధారపడి ఉన్నాయంటూ సినీ సెలబ్రిటీస్ చేసే వాదనల్లో ఎంత వాస్తవం ఉంది అన్నది పక్కన పెడితే.. సినిమా రిలీజైన వెటనే రివ్యూస్ లేదా పబ్లిక్ ఒపీనియన్ ఇవ్వడం వల్ల ఆ సినిమా చూద్దామనే ఆలోచన ఉన్న వాళ్లు కూడా ఆగిపోతున్నారు. ఇదే విషయాన్ని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చెప్పుకొచ్చారు. సినిమా రివ్యూలపై విశాల్ లేటెస్ట్ గా స్పందించారు. సినిమాకు బ్రతికించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
సినిమా రిలీజైనప్పుడు వెంటనే కాకుండా ఒక 3 రోజులు ఆగిన తర్వాత రివ్యూస్ ఇస్తే బాగుంటుందని అన్నారు. సినిమా టాక్ ని యూట్యూబ్ రివ్యూస్, పబ్లిక్ రియాక్షన్ లాంటివి సినిమా రిలీజైన 12 షోలు పూర్తయ్యే దాకా ఆపాలని అన్నారు. ఇలాంటి ఒక నియమాన్ని పాటించేలా చేస్తే సినిమా బ్రతికేందుకు దోహదపడుతుందని అన్నారు విశాల్.
లేటెస్ట్ గా రెడ్ ఫ్లవర్ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన విశాల్ సినిమా రిలీజ్ నాడే రివ్యూస్ ఇవ్వడం, యూట్యూబర్స్ పబ్లిక్ రెస్పాన్స్ లైవ్ ఇవ్వడం లాంటివి సినిమా పరిశ్రమకు ఒక ఇబ్బందిగా మారాయన్నట్టుగా చెప్పారు. సినిమా రిలీజైన 3 రోజుల దాకా అంటే 12 షోల దాకా ఎలాంటి రివ్యూస్, పబ్లిక్ టాక్ లు ఇవ్వకుండా ఉండేలా చేయాలని అన్నారు విశాల్.
ఇదే క్రమంలో తన పెళ్లి గురించి మరోసారి స్పందించారు విశాల్. నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి చేశాకే పెల్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా.. దాని కోసం 9 ఏళ్లుగా కష్టపడుతున్నా.. నడిగర్ సంఘం బిల్డింగ్ చివరి దశకు చేరుకుంది. నా పుట్టినరోజు నాడు గుడ్ న్యూస్ చెబుతా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని అన్నారు విశాల్. కోలీవుడ్ హీరోయిన్ ధన్సికతో విశాల్ ప్రేమలో ఉన్నారని తెలిసిందే. ఈమధ్యనే ఒక ఈవెంట్ లో వారి మ్యారేజ్ ని అనౌన్స్ చేశారు.
ఐతే విశాల్ చెప్పినట్టుగా రివ్యూస్ ని నిజంగానే 12 షోలు అయ్యాక అంటే 3 రోజుల దాకా ఆపే ఛాన్స్ ఉందా అంటే.. అది అసలు సాధ్యం కాదని చెప్పొచ్చు. ఐతే దీనిపై పూర్తిగా ప్రభుత్వం తో చర్చలు జరిపి ఒక కట్టుదిట్టమైన విధానాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఐతే మన దగ్గర రివ్యూస్ రాకుండా చేయడం వరకు చేయగలరు కానీ ఫారిన్ కంట్రీస్ లో అదే సినిమాకు అక్కడ రివ్యూస్ ఇచ్చే వాళ్లు ఉంటారు. సో రివ్యూ లేదా పబ్లిక్ టాక్ ఎక్కడినుంచైనా వచ్చే ఛాన్స్ ఉంది.
