విశాల్ చేసుకోబోతున్న అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?
తాజాగా చెన్నైలో ఓ మూవీ ఈవెంట్ లో విశాల్ తాను సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేశాడు. అక్కడితో ఆగలేదు. తమ పెళ్లి డేట్ ఆగస్ట్ 29 అని డేట్ తో సహా క్లారిటీ ఇచ్చాడు విశాల్.
By: Tupaki Desk | 20 May 2025 4:34 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. విశాల్ నటించిన ఎన్నో సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా డబ్బింగ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. తన సహజ నటనతో సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్, ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా నడిగయార్ సంఘ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
విశాల్ కు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. దీంతో విశాల్ గురించి ఇప్పటికే పలు వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. గతంలో విశాల్ పెళ్లి గురించి కోలీవుడ్ లో ఎన్నో వార్తలు వినిపించాయి. గతేడాది అనీషాతో విశాల్ కు ఎంగేజ్‌మెంట్ కూడా అయింది కానీ కొన్ని కారణాల వల్ల వారి పెళ్లి క్యాన్సిల్ అయింది. దానికంటే ముందే వరలక్ష్మి శరత్ కుమార్ తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలొచ్చాయి.
ఆ తర్వాత మొన్నా మధ్య నటి అభినయను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా అన్నారు. కానీ అవన్నీ రూమర్లేనని ఇప్పుడు తేలిపోయింది. తాజాగా చెన్నైలో ఓ మూవీ ఈవెంట్ లో విశాల్ తాను సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేశాడు. అక్కడితో ఆగలేదు. తమ పెళ్లి డేట్ ఆగస్ట్ 29 అని డేట్ తో సహా క్లారిటీ ఇచ్చాడు విశాల్.
దీంతో విశాల్ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు? ఏంటి అని అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. సాయి ధన్సిక కూడా తమిళ హీరోయినే. 2006లో ఇండస్ట్రీలోకి వచ్చిన ధన్సిక ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. 2016లో వచ్చిన కబాలి సినిమాలో రజినీకాంత్ కు కూతురిగా నటించి ఆ సినిమాతో బాగా పాపులరైంది ధన్సిక.
అయితే టాలెంట్ ఉన్నప్పటికీ ధన్సికకు పెద్దగా లక్ కలిసిరాలేదు. అందుకే ఆమె నటించిన పలు సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. తెలుగులో షికారు, వాలుజడ, అంతిమ తీర్పు, దక్షిణ లాంటి సినిమాల్లో నటించిన ధన్సిక ఇప్పుడు విశాల్ ను పెళ్లి చేసుకోబోతుంది. విశాల్ వయసు 47 ఏళ్లు కాగా ధన్సిక వయసు 35 ఏళ్లే. వీరిద్దరికీ 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.
