పెళ్లి సస్పెన్స్ ను వీడిన తమిళ హీరో
సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం కలిసి ఓ అద్భుతమైన లైఫ్ ను స్టార్ట్ చేయబోతున్నాం.
By: Tupaki Desk | 20 May 2025 10:15 AM ISTతమిళ హీరో విశాల్, నటి సాయి ధన్సిక త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నారు. గత కొన్నాళ్లుగా వీరి పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ వీరిద్దరూ తాము పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తమ రిలేషన్‌ను అనౌన్స్ చేయడంతో పాటూ పెళ్లి డేట్ ను కూడా వెల్లడించింది ఈ జంట. యోగి డా మూవీ ఈవెంట్ లో విశాల్, ధన్సిక ఈ విషయాన్ని బయటపెట్టారు.
సాయి ధన్సిక చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం కలిసి ఓ అద్భుతమైన లైఫ్ ను స్టార్ట్ చేయబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ధన్సిక యాక్టింగ్ కెరీర్ ను కంటిన్యూ చేస్తుందని విశాల్ చెప్పగా అదే విషయాన్ని సాయి ధన్సిక కూడా కన్ఫర్మ్ చేసింది. కొన్నాళ్ల కిందటే తమ మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తన మనసులోని మాటలను బయటపెట్టింది.
అయితే విశాల్ పెళ్లి గురించి ఇప్పటికే పలుసార్లు వార్తలు రాగా, నడిగర్ సంఘం భవనం పూర్తైన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆ భవనం పూర్తైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పెళ్లి చేసుకుంటా. నా లైఫ్ పార్టనర్‌ను కనుక్కున్నానని, ఆల్రెడీ మా మధ్య పెళ్లి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని హింట్ ఇచ్చిన విశాల్ ఇప్పుడు డైరెక్ట్ గా పెళ్లి డేట్ ను అనౌన్స్ చేశాడు.
సాయి ధన్సిక సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి కబాలి సినిమాలో కీలక పాత్ర పోషించి బాగా ఫేమస్ అయింది. దాంతో పాటూ షికారు, సోలో, అంతిమ తీర్పు, దక్షిణ లాంటి తెలుగు సినిమాల్లో కూడా ధన్సిక నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే విశాల్- ధన్సిక మధ్య 12 ఏళ్ల గ్యాప్ కూడా ఉంది. ఎన్ని ఉన్నప్పటికీ వారి ప్రేమ ముందు అవేమీ పనికిరావని ఈ జంట తమ పెళ్లిని అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే విశాల్ గతంలో వరలక్ష్మి శరత్‌కుమార్ తో డేటింగ్ చేశాడని కొన్ని వార్తలు రాగా, తర్వాత అనీషా అల్లాతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ ఎవరికీ తెలియని కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్‌మెంట్ ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
