విశాల్ పెళ్లి వార్తలు.. టాలీవుడ్ హీరోయిన్ తోనేనా?
సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో విశాల్ ఒకరన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 19 May 2025 8:08 PM ISTసౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో విశాల్ ఒకరన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన వివాహం గురించి అనేక సార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. వరలక్ష్మి శరత్‌కుమార్, అభినయ వంటి పలువురు నటీమణులు పేర్లు కూడా విశాల్ పెళ్లి ఊహాగానాల్లో వినిపించాయి.
అంతకుముందు విశాల్ కు.. హైదరాబాద్ కు చెందిన అనీషాతో ఎంగేజ్మెంట్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రిలేషన్ పెళ్లి వరకు వెళ్లలేదు. అయితే ఇప్పటికే నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ అయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని విశాల్ అనౌన్స్ చేశారు. రీసెంట్ గా బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ అయింది. దీంతో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆ సమయంలో పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. త్వరలో వివాహం చేసుకుంటానని తెలిపారు. తన లైఫ్ పార్టనర్ ను కనుగొన్నానని చెప్పారు. ఇప్పటికే పెళ్లి గురించి రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, తనది ప్రేమ వివాహమని చెప్పారు. మరికొద్ది రోజుల్లో తన పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలు అనౌన్స్ చేస్తామని విశాల్ ప్రకటించారు.
దీంతో విశాల్ చేసుకోబోయే ఎవరోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో హీరోయిన్ సాయి ధన్సికతో ఆయన ఏడడుగులు వేయనున్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ ఇప్పటికే ప్రేమలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వారి లవ్ కు పెద్దలు అంగీకారం తెలిపారని.. త్వరలోనే పెళ్లి జరగనుందని అంతా చెబుతున్నారు.
అయితే ఈ వార్తలపై అటు విశాల్ గానీ.. ఇటు సాయి ధన్సిక గానీ రెస్పాండ్ అవ్వలేదు. దీంతో వినిపిస్తున్న గుసగుసలు.. నిజం లాగా అనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. కాగా, తమిళనాడుకు చెందిన సాయి ధన్సిక పలు కోలీవుడ్ చిత్రాల్లో యాక్ట్ చేశారు. తెలుగులో షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా కనిపించారు.
ఇక విశాల్ కెరీర్ విషయానికొస్తే.. చివరిసారిగా మద గజ రాజా మూవీతో సందడి చేశారు. అనేక ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన ఆ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తుప్పరివాలం-2లో నటిస్తున్నారు. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు విశాల్ పెళ్లి వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. వాటిలో నిజమెంతో వేచి చూడాలి.
