Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. విరాట్ - అనుష్క కిక్కిచ్చేలా..

తాజాగా సోషల్ మీడియాలో విరాట్, అనుష్క ఇద్దరూ 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ కి డాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 9:42 AM GMT
గుంటూరు కారం.. విరాట్ - అనుష్క కిక్కిచ్చేలా..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీలో 'కుర్చీ మడత పెట్టి సాంగ్' ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. రిలీజ్ కి ముందు ఈ సాంగ్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. తమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయింది.

సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఈ పాటపై డాన్స్ చేసి అందుకు సంబంధించిన వీడియోలను రీల్స్ ద్వారా షేర్ చేయడంతో ఈ సాంగ్ పేరుతో సోషల్ మీడియాలో కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. ఇక రిలీజ్ తర్వాత థియేటర్స్ లో కుర్చీ మడత పెట్టి సాంగ్ కి మహేష్, శ్రీలీలా మాస్ స్టెప్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా ఈ సాంగ్లో మహేష్ మునుపెన్నడూ లేని విధంగా తన మాస్ డ్యాన్స్ తో అదరగొట్టేసారు.

ఎంతో కాలంగా ఇలాంటి ఒక కంప్లీట్ మాస్ సాంగ్ కి మహేష్ ఊర మాస్ స్టెప్స్ చూడాలన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరికని త్రివిక్రమ్ 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ తో తీర్చేశారు. ఇక ఇదే మాస్ సాంగ్ కి విరాట్ కోహ్లీ, అనుష్క డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే క్రేజీగా ఉంది కదూ.! తాజాగా సోషల్ మీడియాలో విరాట్, అనుష్క ఇద్దరూ 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ కి డాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది.

నిజంగానే ఈ సాంగ్ కి విరాట్, అనుష్క డాన్స్ చేశారా? అంటే కాదు కానీ.. గతంలో విరాట్, అనుష్క డాన్స్ చేసిన ఓ వీడియోని కుర్చీ మడతపెట్టి సాంగ్ తో ఎడిట్ చేసిన ఫ్యాన్స్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సాంగ్ బీట్స్ కి విరాట్, అనుష్కల డాన్స్ స్టెప్పులు సూట్ అవ్వడంతో దీన్ని చూసిన నెటిజెన్లు నిజంగానే మహేష్ సాంగ్ కి విరాట్, అనుష్క ఇలా డాన్స్ చేసారేమో అని ఈ వీడియోకి లైకుల వర్షం కురిపిస్తున్నారు.

ఇక అది పాత డాన్స్ వీడియో అని తెలిసిన నేటిజన్స్ కుర్చీ మహేష్ సాంగ్ కి విరాట్, అనుష్క ల డాన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.