వివాహం అనంతరం తొలిసారి పీఎం మోదీని కలిసిన విరోష్ జంట!
ఎట్టకేలకు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న మూడు ముళ్ళు ఏడడుగులతో కుటుంబ సభ్యుల సమక్షంలో వేద పండితుల ఆశీర్వచనంలో ఒకటయ్యారు.
By: Madhu Reddy | 27 Feb 2026 12:38 PM ISTఎట్టకేలకు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న మూడు ముళ్ళు ఏడడుగులతో కుటుంబ సభ్యుల సమక్షంలో వేద పండితుల ఆశీర్వచనంలో ఒకటయ్యారు. ఇక వివాహం అనంతరం జరిగే రిసెప్షన్ కోసం ఈ జంట సిద్ధమయ్యింది. అందులో భాగంగానే ప్రముఖ రాజకీయ నాయకులను స్వయంగా కలుస్తూ ఇన్విటేషన్ అందిస్తూ వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు విజయ్ దేవరకొం, డ రష్మిక దంపతులు వివాహం జరిగిన మరుసటిరోజే భారత ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా కలిసి హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్లో జరిగే రిసెప్షన్ కి స్వయంగా ఆహ్వానించారు.
ప్రధాని మోదీని కలిసిన విరోష్ జంట..
విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న వివాహం అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానించారు. ఇందులో విజయ్ దేవరకొండ ఐవరీ ఇండో వెస్ట్రన్ ఎంబెల్మెంట్ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో అందంగా కనిపించగా.. అటు ఎల్లో కలర్ పైజామా లో రష్మిక సింపుల్ లుక్ లో ఆకట్టుకుంది. ఇక మోదీ కి ఇన్విటేషన్ తో పాటు శాలువాను బహుకరించి తమ రిసెప్షన్ కు ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కేంద్ర మంత్రిని ఆహ్వానించిన విరోష్ జంట..
ఇకపోతే ఈ జంట ప్రత్యేకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను స్వయంగా కలిసి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వెండి గణేషుడి విగ్రహంతో పాటు రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డును అమిత్ షా కి అందించి ఆహ్వానించారు ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హైదరాబాద్ వేదికగా రిసెప్షన్..
హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్లో మార్చి 4వ తేదీన విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న రిసెప్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉదయపూర్ లో ఉన్న కారణంగా.. రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను రాజకీయ నాయకులను ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా వివాహం అనంతరం ఈ జంట ప్రత్యేకంగా రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ తమ వేడుకను మరింత కన్నుల విందుగా మార్చుకోబోతున్నారు.
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న సినిమాలు..
ఇకపోతే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య గీతాగోవిందం సినిమాతో మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2019లో వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం కావడం విశేషం.. అంతేకాదు వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నా ఈ జంట.. తమ తమ చిత్రాలలో నటిస్తూనే ఈ సినిమాలో కూడా కలిసి కనిపించనున్నారు.
