జంటగా తొలిసారి కనిపించిన విరోష్.. ఆనందంతో వెళ్లి విరిసిన క్షణం!
విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఇన్ని రోజులు రూమర్డ్ జంటగానే ప్రేక్షకులకు కనిపించి అంచనాలు పెంచేశారు.
By: Madhu Reddy | 27 Feb 2026 3:03 PM ISTవిజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఇన్ని రోజులు రూమర్డ్ జంటగానే ప్రేక్షకులకు కనిపించి అంచనాలు పెంచేశారు. అలాంటిది తొలిసారి వివాహం తర్వాత కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి ముఖ్యంగా ఈ క్రేజీ సెలబ్రిటీపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఆనందంతో వెళ్లి విరిసిన ఆ క్షణం కన్నులవిందు గా ఉంది అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
విషయంలోకి వెళితే.. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ ప్యాలెస్ లో 100 మంది అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో.. ఉదయం 10:10 గంటలకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అదే రోజు సాయంత్రం 4:30 రష్మిక కుటుంబ మత ఆచారాల ప్రకారం కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇక వివాహం అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ తమ ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా పెళ్లి ఫోటోలను పంచుకోగా.. ఈ ఫోటోలు వచ్చిన 12 గంటల్లోనే ఏకంగా 28 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించాయి.
ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం.. మార్చి 4వ తేదీన హైదరాబాదులో తాజ్ కృష్ణ హోటల్ వేదికగా జరిగే రిసెప్షన్ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న స్వయంగా కలిసి వెండి గణేష్ విగ్రహాన్ని బహుమతిగా అందజేసి. ఇన్విటేషన్ కార్డు ఆయనకు ఇచ్చి.. సగౌరవంగా రిసెప్షన్ కు ఆహ్వానించారు. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రిసెప్షన్ కు ఆహ్వానించారు. ఇకపోతే మీడియా సమక్షంలో ఈ జంట ఎప్పుడెప్పుడు కనిపిస్తుందని ఎదురుచూసిన అభిమానులకు ఆ తరుణం రానే వచ్చింది.
వైట్ కుర్తా సెట్ లో విజయ్ దేవరకొండ.. రెడ్ కలర్ పైజామాలో రష్మిక మందన్న తొలిసారి వివాహం తర్వాత ఉదయ్ పూర్ ఎయిర్పోర్ట్లో కనిపించి సందడి చేశారు. ఇక జంటగా కనిపించడంతో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఇకపోతే అభిమానులు తమ వైపు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఈ జంట కూడా సంతోషంతో మునిగితేలుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక విషయానికి వస్తే 2018లో పరుశురాం రచనా దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం గీతా గోవిందం ద్వారా వెండితెరకు జంటగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి
. ఇక 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాతో వీరి బంధం మరింత బలపడింది. ఇక అప్పటినుంచి డేటింగ్ లో ఉన్న వీరు గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు . ఇకపోతే ఫిబ్రవరి 22 వరకు దాదాపు 8 సంవత్సరాల పాటు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట ఎట్టకేలకు ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అంటూ తమ పెళ్ళి విషయాన్ని ప్రకటించారు.. ఇక ఇప్పుడు మూడు ముళ్ళు ఏడడుగులతో ఈ జంట ఒకటయ్యారు. ఇక ఈ జంటకు అటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ పలువురు సెలబ్రిటీలు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
