వర్జిన్ బాయ్స్ ట్రైలర్ టాక్..!
లేటెస్ట్ గా అలాంటి న్యూ ఏజ్ యూత్ సినిమాగా రాబోతుంది వర్జిన్ బాయ్స్. గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్, రోనిత్, అన్షులా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయెల్, కౌశల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను దయానంద్ డైరెక్ట్ చేశారు.
By: Tupaki Desk | 5 July 2025 6:32 PM ISTఒక సినిమా హిట్ అవ్వాలంటే అది యూత్ ఆడియన్స్ కి ఎక్కితే సరిపోతుంది. ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఉంటే చాలు సినిమాను వాళ్లే హిట్ చేస్తారు. ఐతే సినిమా చూడటానికి థియేటర్ దాకా రావాలంటే ముందు రిలీజ్ చేసే టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేయాలి. అందుకే ఈమధ్య మేకర్స్ ప్రచార చిత్రాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ట్రైలర్ ఆడియన్స్ కి నచ్చిందా సినిమా సగం హిట్ అన్నట్టే. ఈ క్రమంలోనే కొత్త వారు కూడా తము తీస్తున్న సినిమా కంటెంట్ కి తగిన ట్రైలర్ కట్ తో వస్తున్నారు.
లేటెస్ట్ గా అలాంటి న్యూ ఏజ్ యూత్ సినిమాగా రాబోతుంది వర్జిన్ బాయ్స్. గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్, రోనిత్, అన్షులా, జెన్నిఫర్ ఇమ్మాన్యుయెల్, కౌశల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను దయానంద్ డైరెక్ట్ చేశారు. ట్రైలర్ చూస్తే పక్కా యూత్ కంటెంట్ తో ఉన్నట్టు తెలుస్తుంది. ముగ్గురు కుర్రాళ్లు అమ్మాయిల మీద ఏర్పరచుకునే ఇంట్రెస్ట్.. లవ్.. ఇక వారితో ప్రేమను పంచుకునే సందర్భం ఇలా ప్రతి ఒక్క అంశం కూడా యువతకి మెచ్చేలా ఉన్నాయి.
ఐతే ప్రతి సినిమాలో ఏదో ఒక సీరియస్ థింగ్ ఉన్నట్టుగా వీరి లైఫ్ కం లవ్ స్టోరీస్ లో కూడా కాలం ఒక టెస్ట్ పెడుతుంది. దాన్ని ఎలా రిసాల్వ్ చేసుకున్నారు అన్నది సినిమా కథ. ట్రైలర్ వరకు యూత్ ని థియేటర్ కి రాబట్టేలా ఉంది. సినిమాలో లిప్ లాక్ సీన్స్, అడల్ట్రీ డైలాగ్స్ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.
వర్జింగ్ బాయ్స్ సినిమాను రాజ్ గురు ఫిలింస్ బ్యానర్ లో రాజా దరపునేని నిర్మిస్తున్నారు. స్మరణ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ట్రైలర్ చూస్తే యూత్ ఆడియన్స్ టార్గెట్ తోనే సినిమా తెరకెక్కించారనేలా ఉంది. జూలై 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
వర్జింగ్ బాయ్స్ ట్రైలర్ చూస్తే ఈ అటెంప్ట్ ఏదో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా ఉందని చెప్పొచ్చు. సినిమాను ఆడియన్స్ చూసేందుకు మేకర్స్ సినిమా టికెట్ కొన్న వారికి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.