వర్జిన్ బాయ్స్: అనుకున్నట్లే ఐఫోన్ గిఫ్ట్.. సీటు కింద డబ్బులు
హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో నిర్మాత రాజా దారపునేని, మిత్ర శర్మ లాటరీ డ్రా నిర్వహించగా ఆయనకు ఈ గిఫ్ట్ దక్కింది.
By: Tupaki Desk | 11 July 2025 4:00 PM ISTసినిమా ప్రమోషన్‌లో కొత్త ప్రయోగాలు చూసిన సందర్భాలు తక్కువే. కానీ ‘వర్జిన్ బాయ్స్’ సినిమా టీమ్ ఆ విషయంలో ఓ అడుగు ముందుకేసింది. సాధారణంగా ట్రైలర్, పాటలు, ఈవెంట్లతో ప్రమోషన్ చేసే పద్ధతికి భిన్నంగా.. ‘టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు’, ‘మనీ రైన్’ లాంటి వినూత్న కాన్సెప్టులతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఇందులో భాగంగా ఐఫోన్ గిఫ్ట్, నగదు పంపిణీ వంటి బంపర్ ఆఫర్లు సినిమాపై మరింత హైప్‌ను తెచ్చిపెట్టాయి.
ఈ కాన్సెప్ట్‌లో భాగంగా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసిన వారికి లాటరీ సిస్టమ్ ద్వారా ఐఫోన్ గెలిచే అవకాశం ఇచ్చారు. ఇదే అవకాశం ద్వారా చందానగర్‌కు చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఐఫోన్ గెలుచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో నిర్మాత రాజా దారపునేని, మిత్ర శర్మ లాటరీ డ్రా నిర్వహించగా ఆయనకు ఈ గిఫ్ట్ దక్కింది. ఇదే తొలి గిఫ్ట్ మాత్రమేనని, ఇంకా పది లాటరీలు మిగిలి ఉన్నాయని టీమ్ స్పష్టం చేసింది.
ఇక మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.. ‘మనీ రైన్’’. ఈ ప్రచారంలో భాగంగా థియేటర్లో ఓ ప్రేక్షకుడు కూర్చున్న సీటు కింద రూ.5 వేలు పెట్టగా, సినిమా మధ్యలో ఆయన గమనించి షాక్‌కి గురయ్యాడు. "ఇది నిజంగా నాకేనా?" అంటూ ఆశ్చర్యపోయిన ఆయన ఆనందంగా వీడియోలో స్పందించాడు. ప్రేక్షకుల మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అనేక మందిలో ఆసక్తి రేకెత్తించింది.
ఈ కాన్సెప్ట్ ద్వారా థియేటర్లకు ప్రేక్షకులను ఆకర్షించాలన్నదే టీమ్ ఉద్దేశం. సోషియల్ మీడియాలో దీనిపై రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. మొత్తంగా హైప్ క్రియేట్ చేయడంలో ఇది సక్సెస్ అయ్యిందని చెప్పాలి. థియేటర్లలో జరిగే మనీ రైన్ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనీ, ప్రతి విషయంలో ప్రొఫెషనల్‌గా ప్లాన్ చేసామని టీమ్ చెబుతోంది.
‘‘సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు, మనీ రైన్ లాంటి కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చాయి. ఇప్పటికే ఓ లాటరీలో ఓ వ్యక్తికి ఐఫోన్ ఇచ్చాం, ఇంకా పది ఉన్నాయి. మిగిలిన వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాం. మనీ రైన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా థియేటర్లలో అన్ని ఏర్పాట్లు చేసాం. ఇది సినిమాకు హైప్ తీసుకురావడమే కాకుండా, థియేటర్ అనుభవాన్ని ప్రత్యేకంగా మార్చే ప్రయత్నం’’ అని నిర్మాత రాజా దారపునేని తెలిపారు.
