Begin typing your search above and press return to search.

నిజమైన మత్తు అప్పుడు వస్తుంది..!

ఇదే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మరో యాక్టర్ శ్రీహాన్ కూడా మత్తు పదార్ధాలకు ఎవరు బానిసలు కాకండని అన్నారు.

By:  Tupaki Desk   |   5 July 2025 9:40 PM IST
నిజమైన మత్తు అప్పుడు వస్తుంది..!
X

గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్, రోనిత్ లీడ్ రోల్స్ లో దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వర్జిన్ బాయ్స్. ఈ సినిమాను రాజా దరపునేని నిర్మించారు. జూలై 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ని నేడు ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ సమక్షంలో రిలీజ్ చేశారు. యూత్ ఆడియన్స్ టార్గెట్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మత్తు పదార్థాల వల్ల రిస్క్ లో పడిన ముగ్గురు వ్యక్తుల కథతో ఈ సినిమా వస్తుంది.

ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా పట్ల తమ అనుభూతులు పంచుకున్న యాక్టర్ గీతానంద్ వర్జిన్ బాయ్స్ యూత్ కి బయోపిక్ లాంటిదని అన్నారు. అంతేకాదు నిజమైన సంతోషం మందు, మత్తు పదార్ధాల్లో ఉండదు.. మనం ఏదైనా సాధించప్పుడు వస్తుందని అన్నారు.

ఇదే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మరో యాక్టర్ శ్రీహాన్ కూడా మత్తు పదార్ధాలకు ఎవరు బానిసలు కాకండని అన్నారు. ఎవరైనా అలాంటి చర్యలు చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని.. ఆ విషయంలో బాధ్యతగా ఉండాలని అన్నారు.

టాలీవుడ్ లో నటీనటుల డ్రగ్స్ ఇష్యూ ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉంటుంది. ఐతే అలాంటి టైం లో వర్జిన్ బాయ్స్ టీం ఎంత తమ సినిమాకు రిలేటెడ్ అయిన సరే మత్తు పదార్ధాలు, డ్రగ్స్ గురించి మాట్లాడటం హా**ట్ టాపిక్ గా మారింది. ఈమధ్య యువ నటీనటులు కూడా ఈ డ్రగ్స్ స్కాం లో చిక్కుకుంటున్నారు.. అవకాశాలు రాక మత్తు పదార్ధాలకు బానిస అవుతున్నారని చెప్పుకుంటున్నారు. ఐతే అలాంటిది ఒక యూత్ ఫుల్ సినిమాలోని నటీనటులు ఇలా మత్తు పదార్థాలు వాడొద్దని చెప్పడం ప్రశంసనీయంగా మారింది.

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ రిలీజ్ చేయడమే కాదు జూలై 11న సినిమాను టికెట్ పెట్టి కొనే 11 మంది లక్కీ పీపుల్ కి ఐఫోన్ ని కూడా గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారు చిత్ర యూనిట్. చూస్తుంటే ఈ టీం అంతా కూడా ఈ సినిమాతో ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారన్నట్టు ఉంది. మరి వర్జిన్ బాయ్స్ టీం చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఈ నెల 11న రిలీజ్ అవుతున్న సినిమాకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తారన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.