మా ఫేస్ తెలీదంటున్నారు.. చెబితే ఇంప్రూవ్ చేసుకుంటాం కదా!
అయితే సినిమాకు మిక్స్ డ్ రివ్యూలు ఇస్తున్నారు. ఈ రివ్యూలపై హీరో గీత్ ఆనంద్ స్పందించారు.
By: Tupaki Desk | 12 July 2025 7:00 PM ISTయూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'వర్జిన్ బాయ్స్' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. గీత్ ఆనంద్- మిత్రా శర్మ లీడ్ రోల్స్ లో దర్శకుడు దయానంద్ ఈ సినిమా తెరకెక్కించారు. అంచనాలు లేకుండా జూలై 11న రిలీజైన ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తోంది. దీంతో మేకర్స్ తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ మీట్ లో హీరో గీత్ ఆనంద్ కీలక వాఖ్యలు చేశారు.
అయితే సినిమాకు మిక్స్ డ్ రివ్యూలు ఇస్తున్నారు. ఈ రివ్యూలపై హీరో గీత్ ఆనంద్ స్పందించారు. సినిమాలో ఎవరు ఉన్నారు. వీళ్ల ఫేస్ లు కూడా ఎవరికి తెలీదు అని కొంత మంది రివ్యూలు చెబుతున్నారని గీత్ ఆనంద్ అన్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నటన బాగోలేకపోతే చెప్పాలి, మెరుగు పర్చుకుంటాం. అంతే కానీ ఇలా తీసి పారేయొద్దని హీరో అన్నారు.
సినిమాలో ఎవరి మోహాలు తెలీదు అంటున్నారు. బుక్ మై షో లో మా ప్రొఫైల్స్ ఉంటాయి. రీసెర్చ్ చేసుకుని సినిమాకు రండి. నాకు వర్జిన్ బాయ్స్ మూడో సినిమా. ఇంతకుముందు నేను గేమ్ ఆన్, రథం సినిమాలు కూడా చేశాను. ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టపడాలో మా వైపు నుంచి చూస్తే తెలుస్తుంది. మీరు ఏసీ రూముల్లో కూర్చోని బాగుంది, బాగోలేదు అంటూ ఓ రివ్యూ ఇచ్చేసి సినిమాను తీసిపడేస్తున్నారు.
మరి టార్గెట్ పెట్టుకుంటున్నారా లేదా ఇది రివెంజ్ తీసుకుంటున్నారా? ఏంటో తెలియడం లేదు. కానీ ఈజీగా తీసిపడేస్తున్నారు. సినిమా చేయాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, టీమ్ ఇలా ఎంతో మందిని నానా కష్టాలు పడి ఒప్పించి ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీలో ఫ్యామిలీగా ఆదరిస్తారనన్న నమ్మకంతో వచ్చాం. ఇంకా ముందుకెళ్లాలని ఉంది.
మేం బాగా చేస్తే మెచ్చుకోండి. తప్పులుంటే చెప్పండి సరి చేసుకుంటాం. ఇంప్రూవ్ అవుతాం. కానీ ముందు సినిమా చూడండి. చూసి మాట్లాడండి. థియేటర్లలో రెస్పాన్స్ బాగుంది. ఫ్యామిలీ, యూత్ అందరూ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమానే అన్నిటింటికి సమాధానం చెబుతుంది. అని గీత్ ఆనంద్ సక్సెస్ మీట్ లో అన్నారు.
కాగా, ఈ సినిమాలో గీత్ ఆనంద్ తోపాటు, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ హాన్, మిత్రా శర్మ, రోనిత్, జెనీఫర్ ఇమ్మానుయేల్, అన్శుల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా చిన్న బడ్జెట్ తో ఈ సినిమా తెరెకెక్కింది. పూర్తిగా కంటెట్ ను నమ్ముకున్న ఈ సినిమా మేకర్స్ తొలి నుంచీ ధీమాగానే ఉన్నారు.
