Begin typing your search above and press return to search.

హైప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ.. నెట్ ఫ్లిక్స్ లేటెస్ట్ స్టాండప్ కామెడీ

అయితే ఇండియన్ ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ తాజా "వీర్ దాస్: ఫుల్ వాల్యూమ్" అనే లేటెస్ట్ ఎపిసోడ్ తో ముందుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   25 July 2025 12:30 PM IST
హైప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ.. నెట్ ఫ్లిక్స్ లేటెస్ట్ స్టాండప్ కామెడీ
X

ప్రస్తుత రోజుల్లో స్టాండప్ కామెడీకి ఫుల్ క్రేజ్ వచ్చింది. కొంతమంది ఆర్టిస్ట్ లు స్టాండప్ కామెడీ ద్వారానే ఫేమస్ అవుతున్నారు. అయితే కొన్నికొన్ని సార్లు స్టాండప్ కామెడీ వివాదాలకూ దారి తీస్తుంది. అయితే ఇండియన్ ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ తాజా "వీర్ దాస్: ఫుల్ వాల్యూమ్" అనే లేటెస్ట్ ఎపిసోడ్ తో ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఇది నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఇది ప్రేక్షకులకు ఫుల్ కామెడీ, చమత్కారమైన జోకులు, ప్రపంచవ్యాప్త హాస్య భావం కలిగిస్తుందని భావించారు. కానీ, ఇందులో సహజమైన కామెడీ కరువైంది. కామెడీకి ప్రధాన అంశమైన నవ్వే ఇందులో కరువైంది. ఇది పూర్తిగా ప్రేక్షకులకు హాస్యాన్ని అందించడంలో అనుకున్నంత రీచ్ కాలేదు.

నిజానికి వీర్ దాస్ తన తెలివైన, చమత్కారమైన జోకులకు పేరుగాంచారు. ఆయన షోస్ లలో ధైర్యం, ధైర్యవంతమైన విధానం కనిపిస్తుంటుంది. కానీ తాజాగా రిలీజైన ఫుల్ వాల్యూమ్ వీర్ దాస్ స్టాండర్స్ ను రీచ్ కాలేదు. జోకులకు బదులుగా ప్రేక్షకులకు వాంతులు చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ షో ఆసాంతం ప్రేక్షకుడిది జుగుప్సాకరంగా అనిపించింది.

ఓ స్టాండ్ అప్‌ కామెడీలో సామాజిక- రాజకీయ సమస్యలను లేదా వ్యక్తిగత విషయాలను ప్రస్తావించినట్లైతే ఎలాంటి తప్పు లేదు. కానీ మీరు మీ స్పెషల్‌ షోలో ప్రాపర్ పంచ్‌ లైన్‌ ను డెలివరీ చేయేలేకపోతే, దానిని నిజంగా కామెడీ స్టాండ్ అప్ అని పిలవగలరా అనే ప్రశ్న మనసులోకి వస్తుంది.

స్టాండప్ కామెడీ నుంచి ప్రేక్షకులు విపరీతమైన నవ్వు, మరింత హాస్యాన్ని ఆశిస్తున్నారు. కానీ, ఫుల్ వాల్యూమ్ ఈ అంచనాలు అందుకోవడం లో విఫలమైంది. వీర్ దాస్ ఈసారి ఆ స్టాండర్డ్ అందుకోలేదు. అలాంటి కంటెంట్ అందించడంలో నెట్ ఫ్లిక్స్ కూడా ఈసారి ఫెయిల్ అయ్యింది.