Begin typing your search above and press return to search.

అనుష్క బాట‌లో అందం కోసం ముక్కుకు స‌ర్జ‌రీ?

ఇటీవ‌ల విరాట్ గురించి సోష‌ల్ మీడియాల్లో ఎక్కువ ట్రోలింగ్ జ‌రుగుతోంది. అతడు త‌న భార్య అనుష్క శ‌ర్మ బాటలోనే త‌న‌ ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు అంటూ ట్రోల్ చేశారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 9:32 AM GMT
అనుష్క బాట‌లో అందం కోసం ముక్కుకు స‌ర్జ‌రీ?
X

అందం కోసం సెల‌బ్రిటీల త‌ప‌న గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. కొన్ని సంవత్సరాల క్రితం శిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ అందం కోసం శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకున్నార‌ని ప్ర‌చార‌మైంది. సెలబ్రిటీలు లైపోసక్షన్ వంటి కొవ్వును క‌రిగించే ట్రీట్ మెంట్ కి వెళుతున్న వైనం ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డుతోంది. శ‌స్త్ర చికిత్స‌ల‌కు ముందు, ఆ త‌ర్వాత‌ వారి లుక్ పోస్ట్ లు సోష‌ల్ మీడియాల్లో ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. ముక్కు - పెదవి సర్జరీల‌తో మారిన రూపాలు అభిమానులకు అంతగా నచ్చలేదు. సహజ సౌందర్యాన్ని నాశనం చేసుకున్నందుకు అభిమానులు వారిని ట్రోల్ చేశారు.

సెలబ్రిటీలు అప్పుడు-ఇప్పుడు ఇలా మారారు! అంటూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేస్తూ.. ఎవ‌రు దేనికోసం ఎంత ఖ‌ర్చు చేసారు? అన్న‌దానిపైనా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అందంగా క‌నిపించేందుకు వీరంతా శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకున్నారంటూ ప్ర‌చారం చేసారు.

కేవ‌లం నవతరం నటీనటులే కాదు, రేఖ- సంగీతా బిజ్లానీ లాంటి వారు కూడా ముడతలు పడకుండా ఉండేందుకు చికిత్స‌లు చేయించుకున్నార‌న్న ప్ర‌చారం ఉంది. చర్మం బిగుతుగా మారడం, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ లేదా చర్మం తెల్లబడటం వంటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా పర్ఫెక్ట్‌గా కనిపించాలనే సెలబ్రిటీల అభిరుచి ఎప్పుడూ ఫ్యాషన్ సెన్స్ కి సంబంధించిన‌ది.

ఇటీవ‌ల విరాట్ గురించి సోష‌ల్ మీడియాల్లో ఎక్కువ ట్రోలింగ్ జ‌రుగుతోంది. అతడు త‌న భార్య అనుష్క శ‌ర్మ బాటలోనే త‌న‌ ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు అంటూ ట్రోల్ చేశారు. ఇప్పుడు నెటిజనులు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త ఫోటోల‌ను పాత ఫోటోల‌తో చేర్చి పోలిక‌లు చెబుతున్నారు. అతడు ఇప్పుడు భిన్నంగా కనిపిస్తున్నాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు,..అతడి ముఖ నిర్మాణం పూర్తిగా మారిపోయింది. అతడు మ‌రింత షార్ప్‌గా కనిపిస్తున్నాడు.. అంటూ మారిన రూపంపై కామెంట్లు చేస్తున్నారు. విరాట్ ముక్కుకు సర్జరీ చేయించుకున్నాడని డేగకళ్ల రెడ్డిటర్స్‌లోని ఒక వర్గం అభిప్రాయపడింది. మేకప్ ప్లస్ ఫిల్లర్స్ ప్లస్ బోటాక్స్... వారి చర్మం కుంగిపోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అంటూ ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.

విరాట్ ముఖంలో కొవ్వు త‌గ్గింది. ముక్కు దవడ రేఖ, చెంప ఎముకలు అన్నీ గణనీయంగా మారిపోయాయి! ముక్కు సన్నగా పొడవుగా మారింది.. అంటూ ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించాడు. అత‌డు ఫిట్టెస్ట్ అథ్లెట్లలో ఒకడని, ఒక వ్యక్తి బరువు తగ్గినప్పుడు ముఖం చుట్టూ ఉన్న కొవ్వు, ముఖ్యంగా ముక్కు కూడా తగ్గుతుందని కొంద‌రు అభిమానులు విశ్లేషించారు. ప్రతి నెటిజన్ విరాట్ ముక్కు మీద ఒక్కో ర‌కంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదంతా వ్యాయామం .. మంచి చర్మ సంరక్షణ కారణంగా సాధ్య‌మైంద‌ని, ఎటువంటి శస్త్రచికిత్సలు చేయలేదని కూడా కొంద‌రు స‌మ‌ర్థించారు.

విరాట్ కోహ్లీ ప్రపంచకప్ ఆడేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఫిజిక‌ల్ గా ఫిట్ గా మారాడు. 14 అక్టోబర్ 2023న ప్రపంచ కప్‌లో క్రికెట్ ప్రత్యర్థులు భారతదేశం-పాకిస్తాన్‌లు ఒకదానితో ఒకటి ఆడబోతున్నాయి. ఇదిలా ఉంటే విరాట్ రెండోసారి తండ్రిగా మారుతున్న‌ట్టు క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. అనుష్క శ‌ర్మ‌- విరాట్ ఓ ప్ర‌యివేట్ ప్ర‌సూతి క్లినిక్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ క‌నిపించ‌డంతో ఈ పుకార్లు షికార్ చేసాయి. అధికారికంగా దీనిపై ప్ర‌క‌టించాల్సి ఉంది.