Begin typing your search above and press return to search.

కోహ్లీ లెగ‌సీని న‌డిపించే సిస‌లైన వార‌సుడు

మ‌గ‌బిడ్డ పేరు- అకాయ్ అని కూడా వెల్ల‌డించ‌డంతో ఇప్పుడు ఈ చిన్నారి బాల‌కుడు వెబ్ లో ట్రెండింగ్ గా మారాడు

By:  Tupaki Desk   |   21 Feb 2024 11:42 AM GMT
కోహ్లీ లెగ‌సీని న‌డిపించే సిస‌లైన వార‌సుడు
X

విరుష్క జంట త‌మ రెండో సంతానాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. మ‌గ‌బిడ్డ పేరు- అకాయ్ అని కూడా వెల్ల‌డించ‌డంతో ఇప్పుడు ఈ చిన్నారి బాల‌కుడు వెబ్ లో ట్రెండింగ్ గా మారాడు. సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ షేరింగుల‌తో ఆకాయ్ కోహ్లీ మాస్ హీరోగా మారిపోయాడు. అకాయ్ కూడా ఆట‌లో కోహ్లికి ఉన్న మాస్ ఇమేజ్ ని లెగ‌సీని ముందుకు న‌డిపిస్తాడ‌నే భావ‌న‌ను అభిమానులు వ్య‌క్తం చేసారు. అకాయ్ తన తండ్రి విరాట్ వారసత్వాన్ని ఎలా సాధించుకుంటాడనే దాని గురించి సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ఎడిట్‌లు ఉన్నాయి.

కోహ్లీ వ‌ర్థ‌మాన త‌రానికి ఆద‌ర్శ‌వంత‌మైన ఆట‌గాడు అన‌డంలో సందేహం లేదు. స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత అసాధార‌ణ‌మైన రికార్డుల‌ను సొంతం చేసుకున్న మేటి ఆట‌గాడు కింగ్ కోహ్లీ. అకాయ్ కూడా త‌న తండ్రిలానే క్రికెట్ స్టార్ అవుతాడ‌ని, లెగ‌సీని ముందుకు న‌డిపిస్తాడ‌ని అంత‌ర్జాలంలో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. అభిమానులు ఈ చిన్నారి బాల‌కుడిపై ఎంతో న‌మ్మ‌కం ఉంచ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. క్రికెటర్ AB డివిలియర్స్ స‌హా ఇతరులు దీనిపై ప్రతిస్పందించడం.. ఈ కల్పిత సవరణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అకాయ్ పేరు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. సామాజిక మాధ్య‌మాల్లో విరాట్ వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళతాడో కూడా ప్రజలు వివ‌రించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. పుట్టిన వెంటనే ఆ చిన్నారి సోషల్ మీడియాలో మాస్ హీరోగా మారిపోయాడు. ఇంత‌కుముందు ఆడ‌పిల్ల‌(వామిక‌)కు జ‌న్మ‌నిచ్చిన‌ప్పుడు స్పంద‌న‌ల‌కు భిన్నంగా అకాయ్ విష‌యంలో ప్ర‌జ‌లంతా స్పందించ‌డం ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది.