Begin typing your search above and press return to search.

పెద‌కాపు హీరో టార్గెట్ గౌత‌మ్ మీన‌న్!

దీనిలో భాగంగా రొమాంటిక్ ఫిల్మ్ మేక‌ర్ గౌత‌మ్ మీన‌న్ అత‌ని టార్గెట్ గా రివీల్ చేసాడు. అత‌డితో రొమాంటిక్ ల‌వ్ స్టోరీలు చేసి ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకోవాల‌నుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:30 PM GMT
పెద‌కాపు హీరో టార్గెట్ గౌత‌మ్ మీన‌న్!
X

తెర‌పైకి కొత్త దూరం దూసుకొస్తుంది. ఇమేజ్ తో ప‌నిలేకుండా యువ హీరోలు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాల‌కు క‌టౌట్ తో ప‌నిలేద‌ని ఇప్ప‌టికే ఎన్నో సినిమాల ఫ‌లితాలు నిరూపించాయి. కొత్త వాళ్ల‌కి ప్రేక్ష‌కులు పెద్ద పీఠ వేస్తున్నారు. విశ్వ‌క్ సేన్.. కిర‌ణ్ అబ్బ‌వరం..కార్తికేయ గుమ్మ‌డికొండ‌..న‌వీన్ పొలిశెట్టి లాంటి వారు అలా స‌క్సెస్ అయిన వాడే. వాళ్ల స్పూర్తితో మ‌రింత మంది ఇండ‌స్ట్రీలో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.

తాజాగా శ్రీకాంత్ అడ్డాల 'పెద‌కాపు' సినిమాతో విరాట్ క‌ర్ణ అనే కొత్త కుర్రాడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. విరాట్ మాస్ లుక్ ఆక‌ట్టుకుంటుంది. ఇండ‌స్ట్రీకి ప‌నికొచ్చే కుర్రాడే అనిపిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల ప‌రిచ‌యం చేసిన వ‌రుణ్ సందేశ్ కూడా అలా స‌క్సెస్ అయిన వాడే. 'కొత్త‌బంగారులోకం'తో హీరోగా లాంచ్ అయ్యాడు.

అటుపై కొన్నాళ్ల పాటు వ‌రుణ్ కెరీర్ వెన‌క్కి తిరిగి చూడ‌కుండా సాగిపోయింది. ఆ కోవ‌లో విరాట్ కూడా స‌క్సెస్ అవుతాడ‌ని శ్రీకాంత్ బ‌లంగా విశ్వ‌శిస్తున్నాడు. ఇక విరాట్ ప్లానింగ్ కూడా యూనిక్ గా క‌నిపిస్తుంది. రెగ్యుల‌ర్ ఫార్మెట్ లో కాకుండా ఇప్పుడున్న యంగ్ హీరోల‌కు భిన్నంగా డిఫ‌రెంట్ గా కెరీర్ ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. వైవిథ్య‌మైన ల‌వ్ స్టోరీలు చేయాల‌నుకుంటున్నాడు.

దీనిలో భాగంగా రొమాంటిక్ ఫిల్మ్ మేక‌ర్ గౌత‌మ్ మీన‌న్ అత‌ని టార్గెట్ గా రివీల్ చేసాడు. అత‌డితో రొమాంటిక్ ల‌వ్ స్టోరీలు చేసి ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకోవాల‌నుకుంటున్నాడు. బేసిక్ గానే యువ న‌టుడికి ల‌వ్ స్టోరీలంటే ఆస‌క్తి ఎక్కువ‌ట‌. అవి నేచుర‌ల్ గా ఉండాలంటున్నాడు. గౌత‌మ్ మీన‌న్ తో ఎప్ప‌టికైనా ఓ మంచి ల‌వ్ స్టోరీ చేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ల‌వ్ బుల్ ఇమేజ్ ద‌క్కించుకోవా ల‌నుకుంటున్నాడు. అయితే పెద‌కాపు రిలీజ్ అనంత‌రం పెద‌కాపు2 పైనే ఫోక‌స్ పెడుతున్న‌ట్లు తెలిపాడు.