Begin typing your search above and press return to search.

విరాట్ అనుష్క.. హార్ట్ టచింగ్ హగ్!

విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా అచీవ్మెంట్ అవార్డును కూడా వచ్చింది. అప్పుడు కూడా అతని కళ్ళల్లో ఆనందం కనిపించలేదు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 12:25 PM GMT
విరాట్ అనుష్క.. హార్ట్ టచింగ్ హగ్!
X

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటిగా నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్ళింది. అంతే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని చిన్న సినిమాలలో భాగం అవుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమా కెరీర్ మరోవైపు భార్యగా తల్లిగా తన బాధ్యతలను ఎంతో గౌరవంగా కొనసాగిస్తోంది.


అయితే విరాట్ కోహ్లీకి సంబంధించిన అతి ముఖ్యమైన మ్యాచ్ లు ఉన్నప్పుడు వెంటనే స్టేడియంలో వాలిపోతూ ఉంటుంది. ఇక అనుష్క మ్యాచ్ కు వస్తే మాత్రం వారికి సంబంధించిన మూమెంట్స్ హైలెట్గా నిలుస్తూ ఉంటాయి. ఇటీవల వరల్డ్ కప్ మ్యాచ్ లకు రెగ్యులర్ గా పాల్గొన్న అనుష్క ప్రతీ మ్యాచ్ లో సంతోషం తో టీమిండియా కు అలాగే భర్త విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తూ కనిపించింది.

కానీ ఆదివారం రోజు జరిగిన మ్యాచ్ మాత్రం ఆమెను కూడా చాలా బాధకు గురి చేసింది. ఎంతో మంది అభిమానులు ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్లో గెలవాలి అని కోరుకున్నారు. ఇక మ్యాచ్ మొదలైనప్పుడు నుంచి చివరి వరకు అనుష్క శెట్టి స్టేడియంలోనే కనిపించింది.

ఇక విరాట్ బ్యాటింగ్ చేసినంత సేపు ఆమె చాలా హ్యాపీగా కనిపించింది. ఇక విరాట్ అవుట్ అయిన తర్వాత ఒక్కసారిగా నిరాశకు గురైంది. చివరికి ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంతో అందరి ఆటగాళ్లతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఎంతో బాధ పడ్డాడు. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా అచీవ్మెంట్ అవార్డును కూడా వచ్చింది. అప్పుడు కూడా అతని కళ్ళల్లో ఆనందం కనిపించలేదు.

మ్యాచ్ ఓడిపోయిన బాధ ఎక్కువగా కనిపించింది. ఇక ఆ కఠినమైన క్షణాలలో అతనికి తోడుగా అనుష్క శెట్టి నిలిచింది. విరాట్ కోహ్లీ రాగానే ఆమె ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. విరాట్ ను ప్రేమగా కౌగిలించుకున్న ఆ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ ఎమోషనల్ మూమెంట్ ను చూసి ఫ్యాన్స్ కూడా విరాట్ కోహ్లీ కి మద్దతుగా నిలుస్తున్నారు. కోహ్లీ తన శక్తి మేరకు ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో న్యాయం చేశాడు అని పాజిటివ్ గా స్పందిస్తున్నారు.