Begin typing your search above and press return to search.

మ‌ట‌న్ ముక్క తిన‌లేద‌ని అనుష్క ఫీలవుతుందా?

మంచి ఫిట్ నెస్ ప్రియుడు. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త ఎక్కువ‌. ఎంత ఎక్క‌వు అంటే? భార్య అనుష్క శ‌ర్మ కూడా విసిగిపోయేంత‌గా.

By:  Tupaki Desk   |   21 May 2025 5:30 PM
మ‌ట‌న్ ముక్క తిన‌లేద‌ని అనుష్క ఫీలవుతుందా?
X

క్రికెట‌ర్ల‌కు పెద్ద‌గా డైట్ ప్లాన్స్ అంటూ ఉండ‌వు. ఇది చాలా ప‌రిమితంగా ఉంటుంది. ఫిట్ సెస్ కాపాడు కుంటే చాలు. ఆహ‌రం విష‌యంలో నిమ‌యాలు ఉండ‌వు. కేవ‌లం వ్య‌క్తిగ‌త శ్ర‌ద్ద మీద‌నే ఆధార‌పడి ఉం టుంది. న‌చ్చిన పుడ్ తినే అవ‌కాశం ఉంటుంది. హీరోల్లా క‌డుపు కాల్చుకోవాల్సిన ప‌నిలేదు. మ్యాచ్ కు పిట్ గా ఉన్నాడా? లేదా? అన్న‌దే అక్క‌డ ముఖ్యం. అయితే విరాట్ కోహ్లీ మాత్రం చాలా మంది క్రికెట‌ర్ల‌కు భిన్నం.

మంచి ఫిట్ నెస్ ప్రియుడు. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త ఎక్కువ‌. ఎంత ఎక్క‌వు అంటే? భార్య అనుష్క శ‌ర్మ కూడా విసిగిపోయేంత‌గా. అవును. ఇది నిజ‌మ‌తే విరాట్ డైట్ పేరుతో నోరు క‌ట్టేసుకుం టాడ‌ని.. ఎలాంటి మ‌సాలు పుడ్ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డ‌ని అనుష్క తెలిపింది. త‌న‌కు ఇష్ట‌మైన వంట‌కాలు చేసి తిన‌మ‌ని ఎంత బ్ర‌తిమ‌లాడినా తిన‌డుట‌. హీరోయిన్ గా ప‌నిచేస్తోన్న తానే అంత క‌ఠిన‌మైన డైట్ ప్లాన్ ఏ రోజు అమ‌లు చేయ‌లేద‌ని...విరాట్ మాత్రం తాను చూసిన ఓ డిఫ‌రెంట్ ప‌ర్స‌నాల్టీగా పేర్కొంది.

నాన్ వెజ్ జొలికి వెళ్ల‌డు. అన్ని వెజ్ వంట‌కాలే. ఉప్పు..కారం వాటికి దూరంగా ఉంటాడు. కేవ‌లం ఉడ‌క బెట్టిన ఆహార ప‌దార్ధాలు మాత్ర‌మే తీసుకుంటాడు. పండ్లు..పండ్ల ర‌సాలు మాత్రం క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటాడు. ఉద‌యాన్నే వాట‌ర్ తీసుకోవ‌డం..అటుపై జిమ్ కి వెళ్ల‌డం. అనంత‌రం మొల‌కెత్తిన ప‌ప్పు దినుసులు తీసుకుంటాడుట‌.

మ‌ధ్నాహ్నం ఆహారంలో కూడా వీలైనంత వ‌ర‌కూ ఉప్పు కారానాకి చాలా దూరం ఉంటాడుట‌. రాత్రిపూట కేవ‌లం తేలిక‌పాటి ఆహారం మాత్ర‌మే తీసుకుంటాడు. మ్యాచ్ లున్నా? లేక‌పోయినా డైట్ విష‌యంలో మాత్రం ఎలాంటి మార్పులుండ‌వ‌ని అనుష్క తెలిపింది.